Seyavayya neegu nemdu sellinamtaanu

సేయవయ్య నీకు నేఁడు చెల్లినంతాను
Language

(॥పల్లవి॥)
సేయవయ్య నీకు నేఁడు చెల్లినంతాను
పాయరాదు నిన్ను నిట్టె పైకొనుటేకాని

(॥సేయ॥)
తెగరాదు నీవెంత దిమ్మరివై తిరిగినా
జగడానఁ గొంతగొంత సాదించది
నగరాదు నీవు సేసేనాటకపుఁజేఁతలకు
మొగమోడి చేతులెత్తి మొక్కు టింతేకాని

(॥సేయ॥)
తిట్టరాదు యెవ్వతెతోఁ దెగడియాడినా నిన్ను
జట్టిగాఁ జూపులఁ జూచి జంకించుటే
పట్టరానినీ వెందుఁ బఱచవై తిరిగినా
చెట్టవట్టి నీసేవసుయు టింతేగాని

(॥సేయ॥)
మానరాదు నీవెన్నిమతకములు నుండినా
నానినచెమటలతో నంటుసేయుటే
పూనిక శ్రీవేంకటేశ పొందితివి నన్ను నిట్టె
ఆనుకొని నీతో ముదమందు టింతేకాని

(||pallavi||)
seyavayya nīgu nem̐ḍu sĕllinaṁtānu
pāyarādu ninnu niṭṭĕ paigŏnuḍegāni

(||seya||)
tĕgarādu nīvĕṁta dimmarivai tiriginā
jagaḍānam̐ gŏṁtagŏṁta sādiṁchadi
nagarādu nīvu sesenāḍagabum̐jem̐talagu
mŏgamoḍi sedulĕtti mŏkku ṭiṁtegāni

(||seya||)
tiṭṭarādu yĕvvadĕdom̐ dĕgaḍiyāḍinā ninnu
jaṭṭigām̐ jūbulam̐ jūsi jaṁkiṁchuḍe
paṭṭarāninī vĕṁdum̐ baṟasavai tiriginā
sĕṭṭavaṭṭi nīsevasuyu ṭiṁtegāni

(||seya||)
mānarādu nīvĕnnimadagamulu nuṁḍinā
nāninasĕmaḍalado naṁṭuseyuḍe
pūniga śhrīveṁkaḍeśha pŏṁdidivi nannu niṭṭĕ
ānugŏni nīdo mudamaṁdu ṭiṁtegāni