Seyaneeve yemmelellaam jesevellaa

సేయనీవే యెమ్మెలెల్లాఁ జేసెవెల్లా
Language

(॥పల్లవి॥)
సేయనీవే యెమ్మెలెల్లాఁ జేసెవెల్లా
బాయిటఁ దనకుఁ జిక్కెఁ బండిన కొల్లా

(॥సేయ॥)
పన్నినమరుఁడు బెట్టుపాయ మిది తట్టుముట్టు
యెన్ననేల యింతేపో యిది నాగుట్టు
విన్నవించి సారెసారె వేసఁట దనకు బుట్టు
వన్నెలేలే యిఁకఁ దనవలసినట్టు

(॥సేయ॥)
బూక లెంతయినఁ గద్దు పోయ నిదే కడుఁబొద్దు
వాకునిష్టూరములేలే వద్దువద్దు
యీకడ నేనేమనిన నింతయుఁ దనకే ముద్దు
చేకొనినతనసుద్ది చెప్పరాని బద్దు

(॥సేయ॥)
అంతలోనే తనపొందు ఆధరపానమే విందు
వింతయైనరతులే వెనకముందు
యింతటి శ్రీవేంకటేశుఁ డిపుడే విచ్చేసె నిందు
పంతము చెల్లఁగఁ గూడేభావము చేకొందు

(||pallavi||)
seyanīve yĕmmĕlĕllām̐ jesĕvĕllā
bāyiḍam̐ danagum̐ jikkĕm̐ baṁḍina kŏllā

(||seya||)
panninamarum̐ḍu bĕṭṭubāya midi taṭṭumuṭṭu
yĕnnanela yiṁtebo yidi nāguṭṭu
vinnaviṁchi sārĕsārĕ vesam̐ṭa danagu buṭṭu
vannĕlele yim̐kam̐ danavalasinaṭṭu

(||seya||)
būga lĕṁtayinam̐ gaddu poya nide kaḍum̐bŏddu
vāguniṣhṭūramulele vadduvaddu
yīgaḍa nenemanina niṁtayum̐ danage muddu
segŏninadanasuddi sĕpparāni baddu

(||seya||)
aṁtalone tanabŏṁdu ādharabāname viṁdu
viṁtayainaradule vĕnagamuṁdu
yiṁtaḍi śhrīveṁkaḍeśhum̐ ḍibuḍe vichchesĕ niṁdu
paṁtamu sĕllam̐gam̐ gūḍebhāvamu segŏṁdu