సేయనీవే దానికేమి చేఁతలెల్లాను
(॥పల్లవి॥)
సేయనీవే దానికేమి చేఁతలెల్లాను
పాయరాని పతి తానే పాలించీ నన్నును
(॥సేయ॥)
తలఁపు దెలియుఁదాంకా తలవంచుకొంటిఁగాక
నెలకొని కొసరఁగనేరనా నేను
అలయించనేఁటికంటా నణఁకువ నుంటిఁగాక
చలపట్టి తను నిట్టె సాదించనోపనా
(॥సేయ॥)
చెనకిదాఁకాను సిగ్గులువడితిఁగాక
ననిచి తా నవ్వినట్టె నవ్వనా నేను
చనవిచ్చినందాఁకా సరవి చూచితిఁగాక
పెనఁగి తమకములు పెడరేఁచ జాలనా
(॥సేయ॥)
గుట్టు గనుదాఁకాఁ దేకువతో నుండితిఁగాక
ఱట్టుసేసి కలయనెఱఁగనా నేను
యిట్టె శ్రీవేంకటేశుఁ డింతలో దానన్నుఁ గూడె
చుట్టమనై యన్నిటాను చొక్కించి మీరనా
(||pallavi||)
seyanīve dānigemi sem̐talĕllānu
pāyarāni padi tāne pāliṁchī nannunu
(||seya||)
talam̐pu dĕliyum̐dāṁkā talavaṁchugŏṁṭim̐gāga
nĕlagŏni kŏsaram̐ganeranā nenu
alayiṁchanem̐ṭigaṁṭā naṇam̐kuva nuṁṭim̐gāga
salabaṭṭi tanu niṭṭĕ sādiṁchanobanā
(||seya||)
sĕnagidām̐kānu sigguluvaḍidim̐gāga
nanisi tā navvinaṭṭĕ navvanā nenu
sanavichchinaṁdām̐kā saravi sūsidim̐gāga
pĕnam̐gi tamagamulu pĕḍarem̐sa jālanā
(||seya||)
guṭṭu ganudām̐kām̐ deguvado nuṁḍidim̐gāga
ṟaṭṭusesi kalayanĕṟam̐ganā nenu
yiṭṭĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalo dānannum̐ gūḍĕ
suṭṭamanai yanniḍānu sŏkkiṁchi mīranā