Seyamgalavellaam jesi sevimbettam demaada

సేయఁగలవెల్లాఁ జేసి చెవిఁబెట్టఁ డేమాట
Language

(॥పల్లవి॥)
సేయఁగలవెల్లాఁ జేసి చెవిఁబెట్టఁ డేమాట
దాయివలె నున్నవాఁడు ఱట్టు సేసెనంటాను

(॥సేయఁ॥)
మారు మాట లాడకుంటే మరి వాదులే లేవు
చేరి తలవంచుకుంటే సిగ్గు దోఁచదు
నేరిచినాఁ డీ విద్యలు నెరజాణ తనమంటా
రారానే తనకొద్దే రవ్వలిఁకఁ జూతము

(॥సేయఁ॥)
యెక్కడో పరాకైతే యెగ్గులు దప్పులు లేవు
పక్కన నవ్వు నవ్వితే భయము దీరు
చిక్కించుకొన్నాఁ డేడనో చిత్తడీ ముద్దులెల్ల
కక్కసించకువే తనకత లెల్లఁగందము

(॥సేయఁ॥)
ముసుఁగు వెట్టుకవుంటే ముంచు దరితీపులెల్ల
కొసరకుంటే వలపు కొనసాగును
యెసఁగ శ్రీ వేంకటేశుఁ డి దెరిఁగి నన్నుఁగూడె
విసిగించకురే తన వేడుకలు చూతము

(||pallavi||)
seyam̐galavĕllām̐ jesi sĕvim̐bĕṭṭam̐ ḍemāḍa
dāyivalĕ nunnavām̐ḍu ṟaṭṭu sesĕnaṁṭānu

(||seyam̐||)
māru māḍa lāḍaguṁṭe mari vādule levu
seri talavaṁchuguṁṭe siggu dom̐sadu
nerisinām̐ ḍī vidyalu nĕrajāṇa tanamaṁṭā
rārāne tanagŏdde ravvalim̐kam̐ jūdamu

(||seyam̐||)
yĕkkaḍo parāgaide yĕggulu dappulu levu
pakkana navvu navvide bhayamu dīru
sikkiṁchugŏnnām̐ ḍeḍano sittaḍī muddulĕlla
kakkasiṁchaguve tanagada lĕllam̐gaṁdamu

(||seyam̐||)
musum̐gu vĕṭṭugavuṁṭe muṁchu daridībulĕlla
kŏsaraguṁṭe valabu kŏnasāgunu
yĕsam̐ga śhrī veṁkaḍeśhum̐ ḍi dĕrim̐gi nannum̐gūḍĕ
visigiṁchagure tana veḍugalu sūdamu