Seyamgala voodigaalu sesemu gaaga

సేయఁగల వూడిగాలు సేసేము గాక
Language

(॥పల్లవి॥)
సేయఁగల వూడిగాలు సేసేము గాక
యీ యెడ నిన్ను నేము ఇట్టిట్టనవచ్చునా

(॥సేయ॥)
పొంతనుండి యాకె నీకు బుద్దులెల్లా నేరుపఁగా
సంతతము మాతో మాట చవుల లయ్యీనా
పంతమాడేయాపె నీపై బత్తు లిట్టే చూపఁగాను
కాంతుఁడ నీ వినయాలు కాన వచ్చీనా

(॥సేయ॥)
నంటు సేసుకొని నీతో నవ్వు లాపె నవ్వఁగాను
ఇంటికిరమ్మనఁగా నీ కితవయ్యీనా
జంటై నీ ముందరఁ దాఁ జనవులు మెరయఁగా-
నంటి సరసము లీడ నాఁడ గొలిపీనా

(॥సేయ॥)
వరుస వెట్టుక యాపె వలపులు చల్లఁగాను
సరస నాకుఁ గూచుండ సంగతయ్యీనా
నిరతి శ్రీవేంకటేశ నే నలమేలుమంగను
ధర నన్నేలితి విది దలఁచుకొనేవా

(||pallavi||)
seyam̐gala vūḍigālu sesemu gāga
yī yĕḍa ninnu nemu iṭṭiṭṭanavachchunā

(||seya||)
pŏṁtanuṁḍi yāgĕ nīgu buddulĕllā nerubam̐gā
saṁtadamu mādo māḍa savula layyīnā
paṁtamāḍeyābĕ nībai battu liṭṭe sūbam̐gānu
kāṁtum̐ḍa nī vinayālu kāna vachchīnā

(||seya||)
naṁṭu sesugŏni nīdo navvu lābĕ navvam̐gānu
iṁṭigirammanam̐gā nī kidavayyīnā
jaṁṭai nī muṁdaram̐ dām̐ janavulu mĕrayam̐gā-
naṁṭi sarasamu līḍa nām̐ḍa gŏlibīnā

(||seya||)
varusa vĕṭṭuga yābĕ valabulu sallam̐gānu
sarasa nāgum̐ gūsuṁḍa saṁgadayyīnā
niradi śhrīveṁkaḍeśha ne nalamelumaṁganu
dhara nannelidi vidi dalam̐sugŏnevā