Seyamgala vinnabamu sesidimi needoda

సేయఁగల విన్నపము సేసితిమి నీతోడ
Language

(॥పల్లవి॥)
సేయఁగల విన్నపము సేసితిమి నీతోడ
పాయ కిఁక నీయింతిఁ బాలించవయ్యా

(॥సేయఁ॥)
అడియాసలనుఁ గొంత ఆతుమను తనివొందు
యెడమాఁటలనుఁ గొంత ఇంపొందును
కడుఁదమకములఁ గొంత కడపుఁ పొద్దులు సారె
పడఁతిచందంబు లివి పరికించవయ్యా

(॥సేయఁ॥)
యెదురుచూపులఁ గొంత యెసఁగి సంతోసించు
మదరాగమునఁ గొంత మనసుపట్టు
వెదకేటిగతులఁ గొంత వేడుకలఁ జెలరేఁగు
సుదతిభావంబు లివి చూడఁగదవయ్యా

(॥సేయఁ॥)
తలపోఁతలనుఁ గొంతదడవు మిక్కిలి చెలఁగు
వలపులను వొకకొంత వాడుదేరు
యెలమిఁ గూడితివి నీవిపుడె శ్రీవేంకటేశ
చెలియ నిటువలెనె దయసేయఁ గదవయ్యా

(||pallavi||)
seyam̐gala vinnabamu sesidimi nīdoḍa
pāya kim̐ka nīyiṁtim̐ bāliṁchavayyā

(||seyam̐||)
aḍiyāsalanum̐ gŏṁta ādumanu tanivŏṁdu
yĕḍamām̐ṭalanum̐ gŏṁta iṁpŏṁdunu
kaḍum̐damagamulam̐ gŏṁta kaḍabum̐ pŏddulu sārĕ
paḍam̐tisaṁdaṁbu livi parigiṁchavayyā

(||seyam̐||)
yĕdurusūbulam̐ gŏṁta yĕsam̐gi saṁtosiṁchu
madarāgamunam̐ gŏṁta manasubaṭṭu
vĕdageḍigadulam̐ gŏṁta veḍugalam̐ jĕlarem̐gu
sudadibhāvaṁbu livi sūḍam̐gadavayyā

(||seyam̐||)
talabom̐talanum̐ gŏṁtadaḍavu mikkili sĕlam̐gu
valabulanu vŏgagŏṁta vāḍuderu
yĕlamim̐ gūḍidivi nīvibuḍĕ śhrīveṁkaḍeśha
sĕliya niḍuvalĕnĕ dayaseyam̐ gadavayyā