సేయఁగల విన్నపాలు సేసితి మిదివో నీకు
(॥పల్లవి॥)
సేయఁగల విన్నపాలు సేసితి మిదివో నీకు
నీ యంతనే ఇంతిఁ గరుణించవయ్య ఇపుడు
(॥సేయఁ॥)
నివ్వటిల్ల నేపొద్దు నీకే యెదురుచూచి
జవ్వని యింతేసి ఇఁక జూలిఁబెట్టకు
పువ్వువలెఁ బానుపుపైఁ బొరలీని విరహాన
రవ్వసేయక చూతువురావయ్య లోనికి
(॥సేయఁ॥)
తలఁచితలఁచి నీకే తమకించీ రతులకు
వలచినముద్దరాలి వడి నేఁచకు
అలసి కాఁకలచేత నసురుసురై వున్నది
నెలకొని ఇంతట మన్నించవయ్య యాకెను
(॥సేయఁ॥)
కందువల నీకే కంకణము గట్టుకున్నది
యిందుముఖి కడుగోల యెలఇంచకు
చెందితి వీకె నింతలె శ్రీవేంకటేశుఁడ వచ్చి
యెందు నిట్టె కలకాల మేలవయ్య చెలఁగి
(||pallavi||)
seyam̐gala vinnabālu sesidi midivo nīgu
nī yaṁtane iṁtim̐ garuṇiṁchavayya ibuḍu
(||seyam̐||)
nivvaḍilla nebŏddu nīge yĕdurusūsi
javvani yiṁtesi im̐ka jūlim̐bĕṭṭagu
puvvuvalĕm̐ bānububaim̐ bŏralīni virahāna
ravvaseyaga sūduvurāvayya lonigi
(||seyam̐||)
talam̐sidalam̐si nīge tamagiṁchī radulagu
valasinamuddarāli vaḍi nem̐sagu
alasi kām̐kalaseda nasurusurai vunnadi
nĕlagŏni iṁtaḍa manniṁchavayya yāgĕnu
(||seyam̐||)
kaṁduvala nīge kaṁkaṇamu gaṭṭugunnadi
yiṁdumukhi kaḍugola yĕla̮iṁchagu
sĕṁdidi vīgĕ niṁtalĕ śhrīveṁkaḍeśhum̐ḍa vachchi
yĕṁdu niṭṭĕ kalagāla melavayya sĕlam̐gi