Seyamgala semtalu nee sedi vimkanu

సేయఁగల చేఁతలు నీ చేతి విఁకను
Language

(॥పల్లవి॥)
సేయఁగల చేఁతలు నీ చేతి విఁకను
నాయము నీకే తెలుసు న న్నడిగే దేమీ

(॥॥)
చెలియ మాటలు నీకుఁ జేరి విన్నవించితి
చెలఁగి యాపె కానుక చేతి కిచ్చితి
యెలమిఁ బలుకుఁ బంతాలిటు నీ కొప్పగించితి
నిలుచుక నీ యెదుట నే నిట్టే వున్నదానను

(॥॥)
పడఁతి మారు నేనీ పాదాలకు మొక్కితి
తొడిఁ బడ నానవాలు తొల్లే చూపితి
కడ లేని వినయానఁ గమ్మటిని వేఁడుకొంటే
ఆడరి నీ వేళ గాచు కట్టే వున్నదానను

(॥॥)
వువిద నీ నడుమను వున్నతెర దీసితి
అవిరళముగ సేస లంది యిచ్చితి
తవిలి శ్రీ వేంకటేశ తగ నీకెఁ గూడితివి
జవళి నీ పెండ్లి సంతోసాన నే నున్నదాననూ

(||pallavi||)
seyam̐gala sem̐talu nī sedi vim̐kanu
nāyamu nīge tĕlusu na nnaḍige demī

(||||)
sĕliya māḍalu nīgum̐ jeri vinnaviṁchidi
sĕlam̐gi yābĕ kānuga sedi kichchidi
yĕlamim̐ balugum̐ baṁtāliḍu nī kŏppagiṁchidi
nilusuga nī yĕduḍa ne niṭṭe vunnadānanu

(||||)
paḍam̐ti māru nenī pādālagu mŏkkidi
tŏḍim̐ baḍa nānavālu tŏlle sūbidi
kaḍa leni vinayānam̐ gammaḍini vem̐ḍugŏṁṭe
āḍari nī veḽa gāsu kaṭṭe vunnadānanu

(||||)
vuvida nī naḍumanu vunnadĕra dīsidi
aviraḽamuga sesa laṁdi yichchidi
tavili śhrī veṁkaḍeśha taga nīgĕm̐ gūḍidivi
javaḽi nī pĕṁḍli saṁtosāna ne nunnadānanū