Seyamgala pani naagum jeppu manare

సేయఁగల పని నాకుఁ జెప్పు మనరే
Language

(॥పల్లవి॥)
సేయఁగల పని నాకుఁ జెప్పు మనరే
ఆయమెఱిఁగి మాఁటలు ఆడుమనరే

(॥సేయ॥)
నెట్టినఁ దాన నేను నేరుపరుల మన్నిటా
వట్టిసట లిందులోన వద్దనరే
గుట్టుతెలిసి కొలిమిగూంట్లో సూదులమ్మితే
జట్టిగొని యిద్దరికి చవులేకావా

(॥సేయ॥)
పంతాన వొకరొకరు బలువులు మిద్దరము
వంతులువాసులు నిఁక వద్దనరే
యెంత బేరిజోకొట్టినా యెక్కుడే వాఁగుగాక
పొంతనే నిద్రవోయిన బూమెలేకావా

(॥సేయ॥)
శ్రీ వేంకటేశుఁడు దాను చేరి తనదేవులను
వావినర్తన లడుగవద్దనరే
ఆవటించి నన్నుఁ గూడె అట్టె నీళ్లడచితే
వేవేలకయినాను వేరులయ్యీనా

(||pallavi||)
seyam̐gala pani nāgum̐ jĕppu manare
āyamĕṟim̐gi mām̐ṭalu āḍumanare

(||seya||)
nĕṭṭinam̐ dāna nenu nerubarula manniḍā
vaṭṭisaḍa liṁdulona vaddanare
guṭṭudĕlisi kŏlimigūṁṭlo sūdulammide
jaṭṭigŏni yiddarigi savulegāvā

(||seya||)
paṁtāna vŏgarŏgaru baluvulu middaramu
vaṁtuluvāsulu nim̐ka vaddanare
yĕṁta berijogŏṭṭinā yĕkkuḍe vām̐gugāga
pŏṁtane nidravoyina būmĕlegāvā

(||seya||)
śhrī veṁkaḍeśhum̐ḍu dānu seri tanadevulanu
vāvinardana laḍugavaddanare
āvaḍiṁchi nannum̐ gūḍĕ aṭṭĕ nīḽlaḍaside
vevelagayinānu verulayyīnā