సేయఁగల పని మాకు జెప్పవమ్మా
(॥పల్లవి॥)
సేయఁగల పని మాకు జెప్పవమ్మా
యీయెడ కాతఁడు వచ్చె నెదురుకోవమ్మా
(॥సేయ॥)
భావములోపలనున్న పంతపు నీరమణుడు
కైవశము నీకు నాయగదవమ్మా
ఆవటించి నిన్ను నింత అరడిఁ బెట్టినవాఁడు
నోవిలేకుండాఁ జెక్కునొక్కెఁగదవమ్మా
(॥సేయ॥)
పేరుకొని ఇందాఁకాఁ బిలిపించుకొన్నపతి
యీరీతి నీతొడ యెక్కె నిదివోయమ్మా
సూరుఁడు నీవు యెదురుచూచి మోహించినవాడు
నేరువుల నవ్వు నీపై నించెగదవమ్మా
(॥సేయ॥)
చేపట్టినపెండ్లాడిన శ్రీవేంకటేశ్వరఁడు
యేపున నిన్నుఁ గూడె నిఁకనేమమ్మా
తీపగునీకు మోవిచ్చి తేనెమరపినవీఁడు
నీపొందులే మరిగి నిలిచెగదవమ్మా
(||pallavi||)
seyam̐gala pani māgu jĕppavammā
yīyĕḍa kādam̐ḍu vachchĕ nĕdurugovammā
(||seya||)
bhāvamulobalanunna paṁtabu nīramaṇuḍu
kaivaśhamu nīgu nāyagadavammā
āvaḍiṁchi ninnu niṁta araḍim̐ bĕṭṭinavām̐ḍu
novileguṁḍām̐ jĕkkunŏkkĕm̐gadavammā
(||seya||)
perugŏni iṁdām̐kām̐ bilibiṁchugŏnnabadi
yīrīdi nīdŏḍa yĕkkĕ nidivoyammā
sūrum̐ḍu nīvu yĕdurusūsi mohiṁchinavāḍu
neruvula navvu nībai niṁchĕgadavammā
(||seya||)
sebaṭṭinabĕṁḍlāḍina śhrīveṁkaḍeśhvaram̐ḍu
yebuna ninnum̐ gūḍĕ nim̐kanemammā
tībagunīgu movichchi tenĕmarabinavīm̐ḍu
nībŏṁdule marigi nilisĕgadavammā