Sevulaaraa vinemgaani seppumaa naa kee suddi

చెవులారా వినేఁగాని చెప్పుమా నా కీ సుద్ది
Language

(॥పల్లవి॥)
చెవులారా వినేఁగాని చెప్పుమా నా కీ సుద్ది
జవళి వలపు లిట్టే చల్లుదురా

(॥చెవు॥)
యిరవై నన్నె తలఁతు నెప్పుడు నంటా నాడేవు
తరుణులఁ బొందేవేళ తలఁతువా
యెరవు లేక నాకే యెదురు చూతు ననేవు
కరఁగి చొక్కేవేళ కను విచ్చి చూతువా

(॥చెవు॥)
వనజాక్ష నారూపువాసి చూతు ననేవు
వనితలచన్నులపై వ్రాతువా
చనవున నాపెకే జపియింతు ననేవు
అనుగుఁగాంతఁబిలచేయప్పుడూ జపింతువా

(॥చెవు॥)
యెమ్మెలతో నా నేరుపు లెంతు నంటా నాడేవు
కొమ్మలతోడుత నిట్టే కొనిడుదువా
మమ్ము శ్రీవేంకటేశుఁడ మండెమురాయఁడవై
సమ్మతి గూడే విట్టే చన విత్తువా

(||pallavi||)
sĕvulārā vinem̐gāni sĕppumā nā kī suddi
javaḽi valabu liṭṭe salludurā

(||sĕvu||)
yiravai nannĕ talam̐tu nĕppuḍu naṁṭā nāḍevu
taruṇulam̐ bŏṁdeveḽa talam̐tuvā
yĕravu lega nāge yĕduru sūdu nanevu
karam̐gi sŏkkeveḽa kanu vichchi sūduvā

(||sĕvu||)
vanajākṣha nārūbuvāsi sūdu nanevu
vanidalasannulabai vrāduvā
sanavuna nābĕge jabiyiṁtu nanevu
anugum̐gāṁtam̐bilaseyappuḍū jabiṁtuvā

(||sĕvu||)
yĕmmĕlado nā nerubu lĕṁtu naṁṭā nāḍevu
kŏmmaladoḍuda niṭṭe kŏniḍuduvā
mammu śhrīveṁkaḍeśhum̐ḍa maṁḍĕmurāyam̐ḍavai
sammadi gūḍe viṭṭe sana vittuvā