సేవింపరో జనులాల చేరి మొక్కరో
(॥పల్లవి॥)
సేవింపరో జనులాల చేరి మొక్కరో
భావింప నున్నాఁడిందరి భాగ్యమువలెను
(॥సేవిం॥)
జలకమాడి వున్నాఁడు సర్వేశ్వరుఁడు నిగ్గుఁ
గలిగిన మంచినల్ల కలువవలె
యెలమిఁ గప్పురకాపు ఇదె చాతుకున్నవాఁడు
వెలలేనియట్టి పెద్దవెండికొండవలెను
(॥సేవిం॥)
అందముగఁ దట్టుపుణుఁ గలదుక వున్నవాఁడు
కలదున ఇంద్రనీలాలగనివలెను
ముందరివలెనే తా సొమ్ములు నించుకున్నవాఁడు
పొందిన సంపదలకు పుట్టినిల్లువలెను
(॥సేవిం॥)
మించి యలమేలుమంగ మెడఁ గట్టుకున్నవాఁడు
పొంచి బంగారుతామెరపువ్వువలెను
యెంచఁగ శ్రీవేంకటేశుఁ డిదె కొలువై వున్నవాఁడు
నించిన దాసులపాలి నిధానము వలెను
(||pallavi||)
seviṁparo janulāla seri mŏkkaro
bhāviṁpa nunnām̐ḍiṁdari bhāgyamuvalĕnu
(||seviṁ||)
jalagamāḍi vunnām̐ḍu sarveśhvarum̐ḍu niggum̐
galigina maṁchinalla kaluvavalĕ
yĕlamim̐ gappuragābu idĕ sādugunnavām̐ḍu
vĕlaleniyaṭṭi pĕddavĕṁḍigŏṁḍavalĕnu
(||seviṁ||)
aṁdamugam̐ daṭṭubuṇum̐ galaduga vunnavām̐ḍu
kaladuna iṁdranīlālaganivalĕnu
muṁdarivalĕne tā sŏmmulu niṁchugunnavām̐ḍu
pŏṁdina saṁpadalagu puṭṭinilluvalĕnu
(||seviṁ||)
miṁchi yalamelumaṁga mĕḍam̐ gaṭṭugunnavām̐ḍu
pŏṁchi baṁgārudāmĕrabuvvuvalĕnu
yĕṁcham̐ga śhrīveṁkaḍeśhum̐ ḍidĕ kŏluvai vunnavām̐ḍu
niṁchina dāsulabāli nidhānamu valĕnu