Sevimchumdee mokkumdee shreebadi yidamdu

సేవించుఁడీ మొక్కుఁడీ శ్రీపతి యితఁడు
Language

(॥పల్లవి॥)
సేవించుఁడీ మొక్కుఁడీ శ్రీపతి యితఁడు
భావించుఁడీ మదిలోనఁ బట్టుఁడీ యీ రూపు

(॥సేవించు॥)
అదివో గంగ పుట్టినయిల్లు అహల్యాశాపవిమోచనము
యెదుట నీతనిపాదము లివె వున్నవి
సదరాన నూర్వశికి జన్మభూమి భూకాంతకును
కుదురై కూచుండే నెలవు కోమలంపుఁ దొడలు

(॥సేవించు॥)
అలరఁగా గమలమున అందునే పితామహుని
కలిగించిన నాభిబిల మదివో
అలమేలుమంగకు నటు కౌస్తుభమునకు
నెలవై సొమ్ములచేత నిండుకొన్న వురమూ

(॥సేవించు॥)
వరము లిచ్చే హస్తము వరుసఁ గటిహస్తము
అరుదయిన శంఖచక్రహస్తా లవిగో
సరి మకరపత్రాలు శశిసూర్యనేత్రములు
శిరసుపైఁ గిరీట మదే శ్రీవేంకటపతికి

(||pallavi||)
seviṁchum̐ḍī mŏkkum̐ḍī śhrībadi yidam̐ḍu
bhāviṁchum̐ḍī madilonam̐ baṭṭum̐ḍī yī rūbu

(||seviṁchu||)
adivo gaṁga puṭṭinayillu ahalyāśhābavimosanamu
yĕduḍa nīdanibādamu livĕ vunnavi
sadarāna nūrvaśhigi janmabhūmi bhūgāṁtagunu
kudurai kūsuṁḍe nĕlavu komalaṁpum̐ dŏḍalu

(||seviṁchu||)
alaram̐gā gamalamuna aṁdune pidāmahuni
kaligiṁchina nābhibila madivo
alamelumaṁgagu naḍu kaustubhamunagu
nĕlavai sŏmmulaseda niṁḍugŏnna vuramū

(||seviṁchu||)
varamu lichche hastamu varusam̐ gaḍihastamu
arudayina śhaṁkhasakrahastā lavigo
sari magarabatrālu śhaśhisūryanetramulu
śhirasubaim̐ girīḍa made śhrīveṁkaḍabadigi