Sevimcharo mokkaro selulaala narulaala

సేవించరో మొక్కరో చెలులాల నరులాల
Language

(॥పల్లవి॥)
సేవించరో మొక్కరో చెలులాల నరులాల
కైవశమై వున్నవాఁడు కరుణాకరుండు

(॥సేవిం॥)
బాసికము గట్టుకొని బంగారుగద్దెమీఁద
లాసి కూచున్నాఁడదివో లకిమమ్మతో
సూసకపువనితలు సోబానఁ బాడఁగాను
భాసురమై యొప్పె నదె ప్రహ్లదవరదుఁడు

(॥సేవిం॥)
మునులు చదువఁగాను ముంజేతికంకణాలతో
యెనసి లవ్వులు నవ్వీ నిందిరతో
అనయముఁ బేరఁటాం డ్లారతులెత్తఁగాను
పనివూని వరాలిచ్చీఁ బ్రహ్లదవరదుఁడు

(॥సేవిఁ॥)
పొలఁతులు వడ్డించఁగా బువ్వానఁ గూచుండి
చెలఁగి సరసమాడీ శ్రీదేవితో
యెలమి శ్రీవేంకటాద్రి నీతఁడే యెందుచూచినా
బలవంతుఁడై వున్నాఁడు ప్రహ్లదవరదుఁడు

(||pallavi||)
seviṁcharo mŏkkaro sĕlulāla narulāla
kaivaśhamai vunnavām̐ḍu karuṇāgaruṁḍu

(||seviṁ||)
bāsigamu gaṭṭugŏni baṁgārugaddĕmīm̐da
lāsi kūsunnām̐ḍadivo lagimammado
sūsagabuvanidalu sobānam̐ bāḍam̐gānu
bhāsuramai yŏppĕ nadĕ prahladavaradum̐ḍu

(||seviṁ||)
munulu saduvam̐gānu muṁjedigaṁkaṇālado
yĕnasi lavvulu navvī niṁdirado
anayamum̐ beram̐ṭāṁ ḍlāradulĕttam̐gānu
panivūni varālichchīm̐ brahladavaradum̐ḍu

(||sevim̐||)
pŏlam̐tulu vaḍḍiṁcham̐gā buvvānam̐ gūsuṁḍi
sĕlam̐gi sarasamāḍī śhrīdevido
yĕlami śhrīveṁkaḍādri nīdam̐ḍe yĕṁdusūsinā
balavaṁtum̐ḍai vunnām̐ḍu prahladavaradum̐ḍu