చెవిలో నేకత మేమిచెప్పేవయ్యా
(॥పల్లవి॥)
చెవిలో నేకత మేమిచెప్పేవయ్యా
కవగూడి నీవద్దనే కాచుకున్నదానను
(॥॥)
యేపున నీగురుత నేమేలెఱఁ గమయ్యా
చూపులసాములు సేసేసూడుకాఁ డవు
తీపులనీసుద్దులెల్లా తెలిసితిమయ్యా
ఆపనులకే తిరిగే అందగాఁడవు
(॥॥)
వలయ నీసరితలు వినమటవయ్యా
పలుకుల సానఁ బట్టేపంతగాఁడవు
నిలువునీసింగారము నేఁడు గంటిమయ్యా
మొలకనవ్వుల పెనుమొత్తగాఁడవు
(॥॥)
అంది నిన్నుఁ బొగడితి నౌఁ గదవయ్యా
పొందులరతుల మంచిపోదికాఁడవు
ఇందుకె శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె
విందులమోవితేనెల వేడుకకాఁ డవు
(||pallavi||)
sĕvilo negada memisĕppevayyā
kavagūḍi nīvaddane kāsugunnadānanu
(||||)
yebuna nīguruda nemelĕṟam̐ gamayyā
sūbulasāmulu sesesūḍugām̐ ḍavu
tībulanīsuddulĕllā tĕlisidimayyā
ābanulage tirige aṁdagām̐ḍavu
(||||)
valaya nīsaridalu vinamaḍavayyā
palugula sānam̐ baṭṭebaṁtagām̐ḍavu
niluvunīsiṁgāramu nem̐ḍu gaṁṭimayyā
mŏlaganavvula pĕnumŏttagām̐ḍavu
(||||)
aṁdi ninnum̐ bŏgaḍidi naum̐ gadavayyā
pŏṁdularadula maṁchibodigām̐ḍavu
iṁdugĕ śhrī veṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
viṁdulamovidenĕla veḍugagām̐ ḍavu