Seva sese balimimte selulagella

సేవ చేసే బలిమింతే చెలులకెల్ల
Language

(॥పల్లవి॥)
సేవ చేసే బలిమింతే చెలులకెల్ల
పూవువలె నింకా నిన్నుఁ బొగడేమయ్యా

(॥సేవ॥)
మొక్కఁగానే యింత యేల మొనగోర నూఁదేవు
లక్కవంటి చిత్తపు లలన నేను
యెక్కువ తక్కువ మాట లేమీననరాదు నిన్ను
పుక్కిటికొలఁది నిన్నుఁ బొగడేమయ్యా

(॥సేవ॥)
ప్రియము చెప్పఁగ నేల పిసికేవు చన్నులు
నయగారి జవ్వనపు నాతిని నేను
చెయిముట్టి యంతేసి చెనకఁగరాదు నిన్ను
ముయికి ముయిగా నిన్నుఁ బొగడేమయ్యా

(॥సేవ॥)
చుట్టమ ననఁగ నేల సొలసి వొడివట్టేవు
మట్టులేని యలమేలుమంగను నేను
ఱట్టిడి శ్రీవేంకటేశ ఱాయి గిలిగించరాదు
పొట్టఁబొరుగున నిన్నుఁ బొగడేమయ్యా

(||pallavi||)
seva sese balimiṁte sĕlulagĕlla
pūvuvalĕ niṁkā ninnum̐ bŏgaḍemayyā

(||seva||)
mŏkkam̐gāne yiṁta yela mŏnagora nūm̐devu
lakkavaṁṭi sittabu lalana nenu
yĕkkuva takkuva māḍa lemīnanarādu ninnu
pukkiḍigŏlam̐di ninnum̐ bŏgaḍemayyā

(||seva||)
priyamu sĕppam̐ga nela pisigevu sannulu
nayagāri javvanabu nādini nenu
sĕyimuṭṭi yaṁtesi sĕnagam̐garādu ninnu
muyigi muyigā ninnum̐ bŏgaḍemayyā

(||seva||)
suṭṭama nanam̐ga nela sŏlasi vŏḍivaṭṭevu
maṭṭuleni yalamelumaṁganu nenu
ṟaṭṭiḍi śhrīveṁkaḍeśha ṟāyi giligiṁcharādu
pŏṭṭam̐bŏruguna ninnum̐ bŏgaḍemayyā