సేవ లెప్పుడూఁ జేసి నే చెప్పితిఁగాక
(॥పల్లవి॥)
సేవ లెప్పుడూఁ జేసి నే చెప్పితిఁగాక
వేవేలైనా నిద్దరికి వింత కానటే
(॥సేవ॥)
ననుపు గలిగితేనే నవ్వులింపు లౌఁగాక
మన సొకచోటనుంటే మరి యేఁటికే
కనుఁగొని చే చాఁచితే కానుకియ్య వచ్చుఁ గాక
పెనఁగులాడితేను ప్రియ మౌనటే
(॥సేవ॥)
మక్కువతో వింటేను మాట లాడ వచ్చుఁ గాక
యెక్కడో పరాకైతే యెనయునటే
చక్క వద్దనుంటే మోవిచవి చూపువచ్చుఁగాక
అక్కడా నిక్కడానుంటే నను వౌనటే
(॥సేవ॥)
వొట్టి కాఁగిలించుకొంటే నొద్దిక దనివౌఁగాక
గుట్టున నుండితేను కూడుట యెట్టే
అట్టె శ్రీవేంకటేశుఁ డలమేల్మంగను నేను
దిట్టయై నన్ను నేలె తెలిపితిఁగాక
(||pallavi||)
seva lĕppuḍūm̐ jesi ne sĕppidim̐gāga
vevelainā niddarigi viṁta kānaḍe
(||seva||)
nanubu galigidene navvuliṁpu laum̐gāga
mana sŏgasoḍanuṁṭe mari yem̐ṭige
kanum̐gŏni se sām̐side kānugiyya vachchum̐ gāga
pĕnam̐gulāḍidenu priya maunaḍe
(||seva||)
makkuvado viṁṭenu māḍa lāḍa vachchum̐ gāga
yĕkkaḍo parāgaide yĕnayunaḍe
sakka vaddanuṁṭe movisavi sūbuvachchum̐gāga
akkaḍā nikkaḍānuṁṭe nanu vaunaḍe
(||seva||)
vŏṭṭi kām̐giliṁchugŏṁṭe nŏddiga danivaum̐gāga
guṭṭuna nuṁḍidenu kūḍuḍa yĕṭṭe
aṭṭĕ śhrīveṁkaḍeśhum̐ ḍalamelmaṁganu nenu
diṭṭayai nannu nelĕ tĕlibidim̐gāga