సేసిరా నేను నీవు చెప్పిన ట్టెల్లా
(॥పల్లవి॥)
సేసిరా నేను నీవు చెప్పిన ట్టెల్లా
ఆసల నా విరహగ్ని ఆరనీరా యించుకా
(॥సేసిరా॥)
యిట్టే నీమాటలకు యెదురాడేదాననా
పట్టి నన్ను దియ్యకురా బలిమిఁ నీవు
గుట్టున నే వచ్చినది కూడేకొరకే కాదా
తెట్టెవై కలఁగె మతి తేరనీరా యించుకా
(॥సేసిరా॥)
కాదురా నీ వంటఁగానేఁ గాదనేటిదాననా
సోదించకు నా పయ్యద జూటరి నీవు
ఆదిగొని నే వలచు టందుకొరకు కాదా
పాదుకొన్న నా కోపము పాయనీరా యించుకా
(॥సేసిరా॥)
వొక్కటై నన్నుఁ గూడఁగ నోల్ల ననేదాననా
కిక్కిరిసె గుబ్బలు బిగించకు నీవు
గక్కున శ్రీవేంకటుశ కౌఁగిటఁ గలసితివి
అక్కున నా చెమటలు ఆరనీరా యించుకా
(||pallavi||)
sesirā nenu nīvu sĕppina ṭṭĕllā
āsala nā virahagni āranīrā yiṁchugā
(||sesirā||)
yiṭṭe nīmāḍalagu yĕdurāḍedānanā
paṭṭi nannu diyyagurā balimim̐ nīvu
guṭṭuna ne vachchinadi kūḍegŏrage kādā
tĕṭṭĕvai kalam̐gĕ madi teranīrā yiṁchugā
(||sesirā||)
kādurā nī vaṁṭam̐gānem̐ gādaneḍidānanā
sodiṁchagu nā payyada jūḍari nīvu
ādigŏni ne valasu ṭaṁdugŏragu kādā
pādugŏnna nā kobamu pāyanīrā yiṁchugā
(||sesirā||)
vŏkkaḍai nannum̐ gūḍam̐ga nolla nanedānanā
kikkirisĕ gubbalu bigiṁchagu nīvu
gakkuna śhrīveṁkaḍuśha kaum̐giḍam̐ galasidivi
akkuna nā sĕmaḍalu āranīrā yiṁchugā