చేసినవెల్లాఁ జేసి సిగ్గువడనేమిటికి
(॥పల్లవి॥)
చేసినవెల్లాఁ జేసి సిగ్గువడనేమిటికి
బాసలు తన్నుఁ జేయించి భంగపెట్ట నిఁకను
(॥చేసి॥)
వొడఁబరచేఁగాని వొద్దికి రమ్మనవే
యెడమాట లాడించఁగా నేను వచ్చీని
పడఁతు లెందరినైనా బడిఁబెట్టుక రానీవే
కొడిమలు గట్టి తన్నుఁ గోపగించ నిఁకను
(॥చేసి॥)
మొక్కులు మొక్కీఁగాని మోము చూపుమనవే
అక్కడ నుండఁగాఁ దన కయ్యేదేమి
చొక్కి వారిచ్చినయట్టిసొమ్ముతోనే రానీవే
దక్కె నాకుఁ దను నేమీ తప్పు లెంచ నిఁకను
(॥చేసి॥)
పాదము లొత్తేఁగాని పవ్వళించుమనవే
సాగువలెఁ గూచుండేమి సాదించీని
యీదెస శ్రీవేంకటేశుఁ డేలెఁ దానె రానీవే
ఆదిగొని ఱట్టుసేసి అలయించ నిఁకను
(||pallavi||)
sesinavĕllām̐ jesi sigguvaḍanemiḍigi
bāsalu tannum̐ jeyiṁchi bhaṁgabĕṭṭa nim̐kanu
(||sesi||)
vŏḍam̐barasem̐gāni vŏddigi rammanave
yĕḍamāḍa lāḍiṁcham̐gā nenu vachchīni
paḍam̐tu lĕṁdarinainā baḍim̐bĕṭṭuga rānīve
kŏḍimalu gaṭṭi tannum̐ gobagiṁcha nim̐kanu
(||sesi||)
mŏkkulu mŏkkīm̐gāni momu sūbumanave
akkaḍa nuṁḍam̐gām̐ dana kayyedemi
sŏkki vārichchinayaṭṭisŏmmudone rānīve
dakkĕ nāgum̐ danu nemī tappu lĕṁcha nim̐kanu
(||sesi||)
pādamu lŏttem̐gāni pavvaḽiṁchumanave
sāguvalĕm̐ gūsuṁḍemi sādiṁchīni
yīdĕsa śhrīveṁkaḍeśhum̐ ḍelĕm̐ dānĕ rānīve
ādigŏni ṟaṭṭusesi alayiṁcha nim̐kanu