చేసినవారికి సేఁత చేతనఁ బెట్టు గాదా
(॥పల్లవి॥)
చేసినవారికి సేఁత చేతనఁ బెట్టు గాదా
యీసున నిన్నుఁ జూచేను యెందు వొయ్యే వికను
(॥చేసి॥)
చెలఁగి నామోము చూచి సెలవినే నవ్వేవు నే
వలచి నీవెంట వెంట వచ్చే నంటానా
యిల నాకొలఁదివారా యేమి సేయ వచ్చు నీకుఁ
గలిగీలే యీఫలము కడచెనా వయసు
(॥చేసి॥)
కూరిమి నూరకుండఁగా గోరికొన నూఁదేవు
చేరి నినుఁ జూచి బ్రమసితి నంటానా
యీరీతివారిలోన నెవ్వరిఁ బోలుదు నేను
చేరీలే నీకీపుణ్యము చిత్తగించే వికను
(॥చేసి॥)
మిక్కిలి కాఁగిట నన్ను మితిమీరఁ గూడితివి
తెక్కుల నాతని వెందుఁ దీరదంటానా
ఇక్కడ శ్రీవేంకటేశ యిటు లోనైతివి నాకు
యెక్కెలే తనకు వల పేమిసేసే విఁకను
(||pallavi||)
sesinavārigi sem̐ta sedanam̐ bĕṭṭu gādā
yīsuna ninnum̐ jūsenu yĕṁdu vŏyye viganu
(||sesi||)
sĕlam̐gi nāmomu sūsi sĕlavine navvevu ne
valasi nīvĕṁṭa vĕṁṭa vachche naṁṭānā
yila nāgŏlam̐divārā yemi seya vachchu nīgum̐
galigīle yīphalamu kaḍasĕnā vayasu
(||sesi||)
kūrimi nūraguṁḍam̐gā gorigŏna nūm̐devu
seri ninum̐ jūsi bramasidi naṁṭānā
yīrīdivārilona nĕvvarim̐ boludu nenu
serīle nīgībuṇyamu sittagiṁche viganu
(||sesi||)
mikkili kām̐giḍa nannu midimīram̐ gūḍidivi
tĕkkula nādani vĕṁdum̐ dīradaṁṭānā
ikkaḍa śhrīveṁkaḍeśha yiḍu lonaidivi nāgu
yĕkkĕle tanagu vala pemisese vim̐kanu