సేసినవారికి మరి సేసినంతే పుణ్యము
(॥పల్లవి॥)
సేసినవారికి మరి సేసినంతే పుణ్యము
దోసము లేదు నాయందు దూరకుమీ ఇఁకను
(॥సేసి॥)
అదిగొని రమణుఁడు అంగనలతో నవ్వఁగా
సాదుఁదన మెక్కడిది సవతులకు
యేదెస వేసవియైతే యెండలు గాయకుండునా
తోదోపున మమ్ము నీవు దూరకుమీ ఇఁకను
(॥సేసి॥)
నాలికాఁడై మగవాఁడు నానాదిక్కులు దొక్కఁగా
గోలతన మెక్కడిది కోమలులకు
వేళఁ జంద్రోదయమైతే వెన్నెల గాయకుండునా
తోలితోలి మమ్ము నీవు దూరకుమీ ఇఁకను
(॥సేసి॥)
ఆనుక శ్రీవేంకటేశ అన్నగతులుఁ జెప్పఁగా
మౌన మిపు డెక్కడిది మాకెల్లాను
కానీలే పూచేవనము కాయలు గాయకుండునా
తూనికతోఁ గూడితివి దూరకుమీ ఇఁకను
(||pallavi||)
sesinavārigi mari sesinaṁte puṇyamu
dosamu ledu nāyaṁdu dūragumī im̐kanu
(||sesi||)
adigŏni ramaṇum̐ḍu aṁganalado navvam̐gā
sādum̐dana mĕkkaḍidi savadulagu
yedĕsa vesaviyaide yĕṁḍalu gāyaguṁḍunā
todobuna mammu nīvu dūragumī im̐kanu
(||sesi||)
nāligām̐ḍai magavām̐ḍu nānādikkulu dŏkkam̐gā
goladana mĕkkaḍidi komalulagu
veḽam̐ jaṁdrodayamaide vĕnnĕla gāyaguṁḍunā
tolidoli mammu nīvu dūragumī im̐kanu
(||sesi||)
ānuga śhrīveṁkaḍeśha annagadulum̐ jĕppam̐gā
mauna mibu ḍĕkkaḍidi māgĕllānu
kānīle pūsevanamu kāyalu gāyaguṁḍunā
tūnigadom̐ gūḍidivi dūragumī im̐kanu