చేసినవారి చేతఁలు చేతనఁ బెట్లు గావా
(॥పల్లవి॥)
చేసినవారి చేతఁలు చేతనఁ బెట్లు గావా
యీసున నన్నుఁ జూడఁగ నెఱ్ఱనాయ కన్నులు
(॥చేసి॥)
కోపించి వాదుకురాఁగాఁ గొప్పు కడువెడజారె
యేపున నాతో జగడ మిదివొమ్మదె
యీపాటికి నీపాటి యిఁక నెంత యవునో
పోపో యింతటనైనా బుద్దెఱఁగవే
(॥చేసి॥)
బీరాన నన్నుఁ దిట్టిఁగాఁ బెదవికెంపులు రేఁగె
దూరి పెద్దల నాడేది తోడ దోసమే
దారిదప్పఁదిరిగితే దయ్యమైనాఁ దోడౌనా
యీరు దియ్యఁ బేను వచ్చు నివి యేఁటికే
(॥చేసి॥)
వోపనంటాఁ బెనఁగఁగ వో పోఁకముడి వీడె
దాఁపురాలు బయలాయఁ దగదే యిఁక
ఆపనికి సిగ్గుపడి యట్టే కాఁగిలించితివి
చేపట్టి వదలకు శ్రీవేంకటేశుఁడను
(||pallavi||)
sesinavāri sedam̐lu sedanam̐ bĕṭlu gāvā
yīsuna nannum̐ jūḍam̐ga nĕṭranāya kannulu
(||sesi||)
kobiṁchi vādugurām̐gām̐ gŏppu kaḍuvĕḍajārĕ
yebuna nādo jagaḍa midivŏmmadĕ
yībāḍigi nībāḍi yim̐ka nĕṁta yavuno
pobo yiṁtaḍanainā buddĕṟam̐gave
(||sesi||)
bīrāna nannum̐ diṭṭim̐gām̐ bĕdavigĕṁpulu rem̐gĕ
dūri pĕddala nāḍedi toḍa dosame
dāridappam̐dirigide dayyamainām̐ doḍaunā
yīru diyyam̐ benu vachchu nivi yem̐ṭige
(||sesi||)
vobanaṁṭām̐ bĕnam̐gam̐ga vo pom̐kamuḍi vīḍĕ
dām̐purālu bayalāyam̐ dagade yim̐ka
ābanigi siggubaḍi yaṭṭe kām̐giliṁchidivi
sebaṭṭi vadalagu śhrīveṁkaḍeśhum̐ḍanu