Sesinattu seyavayya sittamu naa bhaagyamu

సేసినట్టు సేయవయ్య చిత్తము నా భాగ్యము
Language

(॥పల్లవి॥)
సేసినట్టు సేయవయ్య చిత్తము నా భాగ్యము
బాస దప్పకుండఁగా నే పైకొంటిఁగాక

(॥సేసౌ॥)
వాసిపట్టుమాటలకే వాదు లడిచితిఁగాక
యీసులనే నే నీతో నెదురాడేనా
నీసరివారమా నేము నీయంతవారమా
ఆసల మన్నించఁగా నే నీయాలనై తిఁగాక

(॥సేసి॥)
చేకొలఁదిదానఁ గాన సిగ్గులు వడితిఁగా
కైకొని నీ వంటఁగా నేఁ గాదనేనా
మేకులు సేసినా నీతో మేరలు నే మీరేనా
జోకతో నీవు నవ్వఁగ సొలసితిఁగాక

(॥సేసి॥)
చనవు సేసుక నీతో సన్నలు సేసితిఁగాక
మనసియ్యక నేనీతో మతకములా
ననిచి శ్రీవేంకటేశ నన్ను నీవె కూడితివి
తనిసి రతుల నిన్ను దక్కఁగొంటిఁగాక

(||pallavi||)
sesinaṭṭu seyavayya sittamu nā bhāgyamu
bāsa dappaguṁḍam̐gā ne paigŏṁṭim̐gāga

(||sesau||)
vāsibaṭṭumāḍalage vādu laḍisidim̐gāga
yīsulane ne nīdo nĕdurāḍenā
nīsarivāramā nemu nīyaṁtavāramā
āsala manniṁcham̐gā ne nīyālanai tim̐gāga

(||sesi||)
segŏlam̐didānam̐ gāna siggulu vaḍidim̐gā
kaigŏni nī vaṁṭam̐gā nem̐ gādanenā
megulu sesinā nīdo meralu ne mīrenā
jogado nīvu navvam̐ga sŏlasidim̐gāga

(||sesi||)
sanavu sesuga nīdo sannalu sesidim̐gāga
manasiyyaga nenīdo madagamulā
nanisi śhrīveṁkaḍeśha nannu nīvĕ kūḍidivi
tanisi radula ninnu dakkam̐gŏṁṭim̐gāga