Sesinatti tappu gaasinade doradanamu

సేసినట్టి తప్పు గాచినదే దొరతనము
Language

(॥పల్లవి॥)
సేసినట్టి తప్పు గాచినదే దొరతనము
వాసుల నాతనిమేలు వన్నెవెట్టరాదా

(॥సేసి॥)
చలము సాదించరాదు చనవుమెరయుచోట
చలివాయఁ బతినేల సాధించేవే
తెలసినపనులకు తేటతెల్ల మిఁకనేల
కులికి పయ్యదమఱఁగున దాఁచరాదా

(॥సేసి॥)
మొక్కలములాడరాదు మొగమోడేయట్టిచోట
కక్కసించి యేల తారుకాణఁబెట్టేవే
వొక్కటైనమీఁద మఱి వూరఁగలసుద్దలేల
అక్కునఁబెట్టుక అట్టే ఆదరించరాదా

(॥సేసి॥)
సిగ్గులు వడఁగరాదు చేకొనికూడినచోట
దగ్గరుండి యిఁకనేల తలవంచేవే
యెగ్గుదీర శ్రీవేంకటేశుఁ డిట్టె నిన్నుఁ గూడె
వెగ్గళించి మోవితేనె విందువెట్టరాదా

(||pallavi||)
sesinaṭṭi tappu gāsinade dŏradanamu
vāsula nādanimelu vannĕvĕṭṭarādā

(||sesi||)
salamu sādiṁcharādu sanavumĕrayusoḍa
salivāyam̐ badinela sādhiṁcheve
tĕlasinabanulagu teḍadĕlla mim̐kanela
kuligi payyadamaṟam̐guna dām̐sarādā

(||sesi||)
mŏkkalamulāḍarādu mŏgamoḍeyaṭṭisoḍa
kakkasiṁchi yela tārugāṇam̐bĕṭṭeve
vŏkkaḍainamīm̐da maṟi vūram̐galasuddalela
akkunam̐bĕṭṭuga aṭṭe ādariṁcharādā

(||sesi||)
siggulu vaḍam̐garādu segŏnigūḍinasoḍa
daggaruṁḍi yim̐kanela talavaṁcheve
yĕggudīra śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ ninnum̐ gūḍĕ
vĕggaḽiṁchi movidenĕ viṁduvĕṭṭarādā