చేసినట్టెల్లా నీవు సేయవయ్యా
(॥పల్లవి॥)
చేసినట్టెల్లా నీవు సేయవయ్యా
వోసరించి నవ్వుతా నే నూరకుండే నిఁకను
(॥॥)
మల్లడిమీగుణములు మానుమన మాకేల
చెల్లుబడిగలవారే చెప్పేరు గాక
ముల్లు ముంటనేకాక ముసలాన వచ్చునా
వొల్ల వొల్ల నీవద్ద నూరకుండే నిఁకను
(॥॥)
కొత్తసుద్దులెల్ల నేము కోరి నీతో నాడనేల
చిత్తమువచ్చినవారే చెప్పేరుగాక
మెత్తనైన చోటికే మించినగుద్దలి వాఁడి
వొత్తనేల వింతవార మూరకుండే మిఁకను
(॥॥)
అంగపు నీ రేకలు అవి చూప మాకేల
చెంగట సలిగెవారే చెప్పేరుగాక
అంగవించి శ్రీవేంకటాధిప నన్నుఁ గూడితి-
వుంగిటిరతులతోడ నూరకుండే మిఁకను
(||pallavi||)
sesinaṭṭĕllā nīvu seyavayyā
vosariṁchi navvudā ne nūraguṁḍe nim̐kanu
(||||)
mallaḍimīguṇamulu mānumana māgela
sĕllubaḍigalavāre sĕpperu gāga
mullu muṁṭanegāga musalāna vachchunā
vŏlla vŏlla nīvadda nūraguṁḍe nim̐kanu
(||||)
kŏttasuddulĕlla nemu kori nīdo nāḍanela
sittamuvachchinavāre sĕpperugāga
mĕttanaina soḍige miṁchinaguddali vām̐ḍi
vŏttanela viṁtavāra mūraguṁḍe mim̐kanu
(||||)
aṁgabu nī regalu avi sūba māgela
sĕṁgaḍa saligĕvāre sĕpperugāga
aṁgaviṁchi śhrīveṁkaḍādhiba nannum̐ gūḍidi-
vuṁgiḍiraduladoḍa nūraguṁḍe mim̐kanu