Sesinattellaa neegum jellemgaaga

చేసినట్టెల్లా నీకుఁ జెల్లెఁగాక
Language

(॥పల్లవి॥)
చేసినట్టెల్లా నీకుఁ జెల్లెఁగాక
వాసులు వంతులుఁబట్టి వద్దనేమా నిన్నును

(॥చేసి॥)
కన్నుల నిన్నుఁజూచితే కాయమెల్లాఁ జెమరించె
కన్నెకు నీకునుఁ బొందు గలుగఁబోలు
నన్నుఁజూచి నీవేల నవ్వులు నవ్వే వప్పటి
యెన్ని సేసినా నేరము లెంచేమా నిన్నును

(॥చేసి॥)
చేకొని యెదుట నుంటే సిగ్గులు వడీఁదాను
ఆకెకు నీకును మాటల మరఁబోలు
వాకునఁ బిలిచితేను వంచేవు శిరసప్పటి
కాకుసేసి నీచేఁతలు కాదనేమా నిన్నును

(॥చేసి॥)
పానుపు చేరి వుండితే దావము గరఁగీనాపె
నానాఁడే మీకిద్దరికి ననుచఁబోలు
పూని శ్రీ వేంకటేశుఁడ పొందితివి నన్నప్పటి
దీనికిఁగా నింతలో సాదించేనూ నిన్నును

(||pallavi||)
sesinaṭṭĕllā nīgum̐ jĕllĕm̐gāga
vāsulu vaṁtulum̐baṭṭi vaddanemā ninnunu

(||sesi||)
kannula ninnum̐jūside kāyamĕllām̐ jĕmariṁchĕ
kannĕgu nīgunum̐ bŏṁdu galugam̐bolu
nannum̐jūsi nīvela navvulu navve vappaḍi
yĕnni sesinā neramu lĕṁchemā ninnunu

(||sesi||)
segŏni yĕduḍa nuṁṭe siggulu vaḍīm̐dānu
āgĕgu nīgunu māḍala maram̐bolu
vāgunam̐ bilisidenu vaṁchevu śhirasappaḍi
kāgusesi nīsem̐talu kādanemā ninnunu

(||sesi||)
pānubu seri vuṁḍide dāvamu garam̐gīnābĕ
nānām̐ḍe mīgiddarigi nanusam̐bolu
pūni śhrī veṁkaḍeśhum̐ḍa pŏṁdidivi nannappaḍi
dīnigim̐gā niṁtalo sādiṁchenū ninnunu