Sesinattellaa neegum jelladaa nemdu

సేసినట్టెల్లా నీకుఁ జెల్లదా నేఁడు
Language

(॥పల్లవి॥)
సేసినట్టెల్లా నీకుఁ జెల్లదా నేఁడు
సేసపాలెల్లాఁ జిందీ చేరి నవ్వకిఁకను

(॥సేసి॥)
చొప్ప లెత్తనేల నాకు సోదించనేఁటికి నిన్ను
యెప్పుడు నీవోజలు నే నెరిఁగినవే
తప్పించుకో నెట్టు వచ్చు తారుకాణలైనచోట
పిప్పిగట్టీ మోవి యానవెట్టుకోకు మిఁకను

(॥సేసి॥)
పంగించగా నేమివచ్చీ పంతమాడాఁ బనిలేదు
సంగతి నీవలపులు సాజమే నీకు
ముంగిట వేసుకోరాదు మూలనున్న సిగ్గులు
వెంగెమయ్యీ సారె సారె వెసఁ జూడ కిఁకను

(॥సేసి॥)
పెనఁగఁగవద్దు నీతో బెట్టు నిన్ను దూరనోప
ఘనమైనయాస నీకు గలిగినదె
యెనసి శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిదె
తనివయ్యీ రతులను తమకించ కిఁకను

(||pallavi||)
sesinaṭṭĕllā nīgum̐ jĕlladā nem̐ḍu
sesabālĕllām̐ jiṁdī seri navvagim̐kanu

(||sesi||)
sŏppa lĕttanela nāgu sodiṁchanem̐ṭigi ninnu
yĕppuḍu nīvojalu ne nĕrim̐ginave
tappiṁchugo nĕṭṭu vachchu tārugāṇalainasoḍa
pippigaṭṭī movi yānavĕṭṭugogu mim̐kanu

(||sesi||)
paṁgiṁchagā nemivachchī paṁtamāḍām̐ baniledu
saṁgadi nīvalabulu sājame nīgu
muṁgiḍa vesugorādu mūlanunna siggulu
vĕṁgĕmayyī sārĕ sārĕ vĕsam̐ jūḍa kim̐kanu

(||sesi||)
pĕnam̐gam̐gavaddu nīdo bĕṭṭu ninnu dūranoba
ghanamainayāsa nīgu galiginadĕ
yĕnasi śhrī veṁkaḍeśha yelidivi nannu nidĕ
tanivayyī radulanu tamagiṁcha kim̐kanu