(॥పల్లవి॥)
సేసినట్టె వానిఁ జేయనీరే
మాసటీనివంటి మంకువాఁడే
(॥సేసి॥)
పట్టఁగఁ బట్టఁగఁ బాముతల దొక్కె
యిట్టిపిన్నవాని నేమందమే
తిట్టఁగఁదిట్టఁగ దినె వెన్నలెల్ల
బట్టగుత్తుచలపాదివాఁడే
(॥సేసి॥)
కూయఁగఁగూయఁగఁ గోకలు దొంగిలె
వోయమ్మ వీఁడెంత వుద్దండీఁడే
తోయఁగఁదోయఁగ దుండగములు సేసె
చేయిమీఁదయి నట్టిసీఁటవాఁడే
(॥సేసి॥)
చెప్పఁగఁ జెప్పఁగఁ జేతఁ గొండ యెత్తె
అప్పుడే శ్రీవేంకటాద్రీశుఁడే
కప్పఁగఁగప్పఁగఁ గలసె నింతుల
అప్పఁ డలమేల్మంగాధిపుడే
(||pallavi||)
sesinaṭṭĕ vānim̐ jeyanīre
māsaḍīnivaṁṭi maṁkuvām̐ḍe
(||sesi||)
paṭṭam̐gam̐ baṭṭam̐gam̐ bāmudala dŏkkĕ
yiṭṭibinnavāni nemaṁdame
tiṭṭam̐gam̐diṭṭam̐ga dinĕ vĕnnalĕlla
baṭṭaguttusalabādivām̐ḍe
(||sesi||)
kūyam̐gam̐gūyam̐gam̐ gogalu dŏṁgilĕ
voyamma vīm̐ḍĕṁta vuddaṁḍīm̐ḍe
toyam̐gam̐doyam̐ga duṁḍagamulu sesĕ
seyimīm̐dayi naṭṭisīm̐ṭavām̐ḍe
(||sesi||)
sĕppam̐gam̐ jĕppam̐gam̐ jedam̐ gŏṁḍa yĕttĕ
appuḍe śhrīveṁkaḍādrīśhum̐ḍe
kappam̐gam̐gappam̐gam̐ galasĕ niṁtula
appam̐ ḍalamelmaṁgādhibuḍe