Sesinattallaam jeyave sellune neegu

చేసినట్టల్లాఁ జేయవే చెల్లునే నీకు
Language

(॥పల్లవి॥)
చేసినట్టల్లాఁ జేయవే చెల్లునే నీకు
యే సుద్దులు నేల కత లిఁకనేమి చెప్పేమే

(॥॥)
వచ్చెఁగా రమణుఁడు నీవద్దికి నేఁడు
హెచ్చిన నీతలఁ పోత లీడేరేఁగా
యిచ్చెఁగా నీకు జనవు లింతటిలోనే నీ-
యిచ్చకములు ఫలియించె నిఁక నేమి చెప్పేమే

(॥॥)
వున్నాడుఁగా యితఁడు నీవొద్దఁబాయక
తన్నుఁదానే నీ కోరిక తలకూడెఁగా
విన్నపాలెల్ల వినెఁగా వేడుక తోడ
యెన్నికలు సరివచ్చె నిఁకనేమి చెప్పేమే

(॥॥)
కలసెఁగా నిన్ను శ్రీవేంకటవిభుఁడు
అలమేలుమంగవు నిన్నాదరించెఁగా
అలరి మమ్యేలెఁగా నీయప్పణచేత
యిల నీవే జాణవైతి విఁకనేమి చెప్పేమే

(||pallavi||)
sesinaṭṭallām̐ jeyave sĕllune nīgu
ye suddulu nela kada lim̐kanemi sĕppeme

(||||)
vachchĕm̐gā ramaṇum̐ḍu nīvaddigi nem̐ḍu
hĕchchina nīdalam̐ poda līḍerem̐gā
yichchĕm̐gā nīgu janavu liṁtaḍilone nī-
yichchagamulu phaliyiṁchĕ nim̐ka nemi sĕppeme

(||||)
vunnāḍum̐gā yidam̐ḍu nīvŏddam̐bāyaga
tannum̐dāne nī koriga talagūḍĕm̐gā
vinnabālĕlla vinĕm̐gā veḍuga toḍa
yĕnnigalu sarivachchĕ nim̐kanemi sĕppeme

(||||)
kalasĕm̐gā ninnu śhrīveṁkaḍavibhum̐ḍu
alamelumaṁgavu ninnādariṁchĕm̐gā
alari mamyelĕm̐gā nīyappaṇaseda
yila nīve jāṇavaidi vim̐kanemi sĕppeme