Sesinamte semtagaaga selu lellaa nee pattugu

చేసినంతే చేఁతగాక చెలు లెల్లా నీ పట్టుకు
Language

(॥పల్లవి॥)
చేసినంతే చేఁతగాక చెలు లెల్లా నీ పట్టుకు
తాసువలె మెలఁగితే తగ వెఱిఁగేవా

(॥చేసి॥)
వద్దనుండి నీ కాపె వలపులు రేఁచఁగాను
బుద్ది చెప్పితే వినేవా పొరుగువారు
వుద్దండాననె నిన్ను వొడివట్టి తియ్యఁగాను
కొద్ది నుంటి వింతే కాక గుణ మెరిఁగేవా

(॥చేసి॥)
నలుగడ నాకె నీతో నవ్వు లట్టె నవ్వఁగాను
పిలిచినాఁ బలికేవా పెరవారు
చలము సాదించి నిన్ను సరిఁ గాఁగిలించు కొఁగా
కలయ వచ్చేవు గాక కరఁగేటి వాఁడవా

(॥చేసి॥)
రతులచవులు చూపి రచ్చ నిన్ను వేయఁగా
యితవు సేసితేఁ జవులా యింటివారు
మితి మీరి నేఁ గూడఁగ మెల్లనె శ్రీవెంకటేశ
తతిఁ జేకొంటివి గాక తగిలేటివాఁడవా

(||pallavi||)
sesinaṁte sem̐tagāga sĕlu lĕllā nī paṭṭugu
tāsuvalĕ mĕlam̐gide taga vĕṟim̐gevā

(||sesi||)
vaddanuṁḍi nī kābĕ valabulu rem̐sam̐gānu
buddi sĕppide vinevā pŏruguvāru
vuddaṁḍānanĕ ninnu vŏḍivaṭṭi tiyyam̐gānu
kŏddi nuṁṭi viṁte kāga guṇa mĕrim̐gevā

(||sesi||)
nalugaḍa nāgĕ nīdo navvu laṭṭĕ navvam̐gānu
pilisinām̐ baligevā pĕravāru
salamu sādiṁchi ninnu sarim̐ gām̐giliṁchu kŏm̐gā
kalaya vachchevu gāga karam̐geḍi vām̐ḍavā

(||sesi||)
radulasavulu sūbi rachcha ninnu veyam̐gā
yidavu sesidem̐ javulā yiṁṭivāru
midi mīri nem̐ gūḍam̐ga mĕllanĕ śhrīvĕṁkaḍeśha
tadim̐ jegŏṁṭivi gāga tagileḍivām̐ḍavā