సేసినది చేఁతగాక చేతికి లోనైనవేళ
(॥పల్లవి॥)
సేసినది చేఁతగాక చేతికి లోనైనవేళ
యీసున నిందుకుఁ బతి కెదురాడనేఁటికే
(॥సేసి॥)
తత్తరించి కూడేవేళ తాలిము లున్నవా
హత్తి కాఁగిలించేవేళ నానలు మరున్నవా
ఇత్తల నవ్వేవేళ యెగ్గుదప్పు లున్నవా
కొత్తగాఁ బతి నిందుకుఁ గోపగించనేఁటికే
(॥సేసి॥)
చెఱఁగు వట్టిన మీఁదఁ జేసన్న లున్నవా
కఱతల రతివేళ ఘాత లెంచ నున్నదా
మఱఁగు వాసినవేళ మఱి సిగ్గులున్నవా
వుఱకె యిందుకుఁ బతి నుప్పటించనేఁటికే
(॥సేసి॥)
రతికేళి సేయు వేళ రాజసము లున్నవా
తతివచ్చినపటికి దాఁచఁ జోటు లున్నవా
యితవై శ్రీవేంకటేశుఁ డిట్టె నిన్నుఁ గలసె
అతని నిందుకుఁగాను అదలించనేఁటికే
(||pallavi||)
sesinadi sem̐tagāga sedigi lonainaveḽa
yīsuna niṁdugum̐ badi kĕdurāḍanem̐ṭige
(||sesi||)
tattariṁchi kūḍeveḽa tālimu lunnavā
hatti kām̐giliṁcheveḽa nānalu marunnavā
ittala navveveḽa yĕggudappu lunnavā
kŏttagām̐ badi niṁdugum̐ gobagiṁchanem̐ṭige
(||sesi||)
sĕṟam̐gu vaṭṭina mīm̐dam̐ jesanna lunnavā
kaṟadala radiveḽa ghāda lĕṁcha nunnadā
maṟam̐gu vāsinaveḽa maṟi siggulunnavā
vuṟagĕ yiṁdugum̐ badi nuppaḍiṁchanem̐ṭige
(||sesi||)
radigeḽi seyu veḽa rājasamu lunnavā
tadivachchinabaḍigi dām̐sam̐ joḍu lunnavā
yidavai śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ ninnum̐ galasĕ
adani niṁdugum̐gānu adaliṁchanem̐ṭige