Sesinadellaam jemta sellumbadaaya meegu

సేసినదెల్లాఁ జేఁత చెల్లుఁబడాయ మీకు
Language

(॥పల్లవి॥)
సేసినదెల్లాఁ జేఁత చెల్లుఁబడాయ మీకు
వెూసులుగా నవ్వరాదా మోహమెల్లాఁ గంటిమి

(॥॥)
దగ్గరనుంటే మీకు తమకము వుట్టుఁగాక
సిగ్గువ డెల్లంతనుంటే చింతరేఁగదా
యెగ్గులేదు పతితొడ యెక్కుక కూచుండఁగదే
వెగ్గళించి కాదనేమా వెరుపేల ఇఁకను

(॥॥)
మొగములు చూచుకొంటే ముచ్చట లీడేరుఁగాక
నిగిడి తలవంచితే నిండదా కాఁక
తగవౌమగనితోను దట్టించి మాటాడఁగదే
జగడించేవా రున్నారా సటలేల ఇఁకను

(॥॥)
ఇట్టె కాఁగిలించుకొంటే నితవులై వుండుఁగాక
గుట్టుననుంటే చెమట గుబులుకోదా
జట్టిగొని శ్రీ వేంకటేశ్వరుఁడు నన్నిటు గూడె
ఱట్టు కొత్తగా నయ్యెరా గుట్టేల ఇఁకను

(||pallavi||)
sesinadĕllām̐ jem̐ta sĕllum̐baḍāya mīgu
vĕూsulugā navvarādā mohamĕllām̐ gaṁṭimi

(||||)
daggaranuṁṭe mīgu tamagamu vuṭṭum̐gāga
sigguva ḍĕllaṁtanuṁṭe siṁtarem̐gadā
yĕgguledu padidŏḍa yĕkkuga kūsuṁḍam̐gade
vĕggaḽiṁchi kādanemā vĕrubela im̐kanu

(||||)
mŏgamulu sūsugŏṁṭe muchchaḍa līḍerum̐gāga
nigiḍi talavaṁchide niṁḍadā kām̐ka
tagavaumaganidonu daṭṭiṁchi māḍāḍam̐gade
jagaḍiṁchevā runnārā saḍalela im̐kanu

(||||)
iṭṭĕ kām̐giliṁchugŏṁṭe nidavulai vuṁḍum̐gāga
guṭṭunanuṁṭe sĕmaḍa gubulugodā
jaṭṭigŏni śhrī veṁkaḍeśhvarum̐ḍu nanniḍu gūḍĕ
ṟaṭṭu kŏttagā nayyĕrā guṭṭela im̐kanu