చేసినదే చేఁతా చెల్లుబడిగలచోట
(॥పల్లవి॥)
చేసినదే చేఁతా చెల్లుబడిగలచోట
సేసకొప్పు విభుఁడ నీచిత్తమింతే ఇఁకను
(॥చేసి॥)
విన్నదే వినికి వివేకించినచోట
కన్నదే కానుపు మరి గలయుచోట
వున్నదే వునికి వోపికెగులగుచోట
చెన్నగువిభుఁడ నీచిత్త మింతే యిఁకను
(॥చేసి॥)
ఆడినదే మాట ఆయమెఱిఁగినచోట
కూడినదే కూటమి చేకొనుచోటను
వేడుకలే వేఁటవీడుదోడాడేచోట
జేడుమోహపువిభుఁడ చిత్తమింతే యిఁకను
(॥చేసి॥)
యెంచినదే యేలికఏవి యెగ్గుతప్పులేనిచోట
నించినదే మోహము నీనాచోట
యెంచఁగల శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
చెంచెత నింతే నీచిత్త మింతే యిఁకను
(||pallavi||)
sesinade sem̐tā sĕllubaḍigalasoḍa
sesagŏppu vibhum̐ḍa nīsittamiṁte im̐kanu
(||sesi||)
vinnade vinigi vivegiṁchinasoḍa
kannade kānubu mari galayusoḍa
vunnade vunigi vobigĕgulagusoḍa
sĕnnaguvibhum̐ḍa nīsitta miṁte yim̐kanu
(||sesi||)
āḍinade māḍa āyamĕṟim̐ginasoḍa
kūḍinade kūḍami segŏnusoḍanu
veḍugale vem̐ṭavīḍudoḍāḍesoḍa
jeḍumohabuvibhum̐ḍa sittamiṁte yim̐kanu
(||sesi||)
yĕṁchinade yeligaevi yĕggudappulenisoḍa
niṁchinade mohamu nīnāsoḍa
yĕṁcham̐gala śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi
sĕṁchĕda niṁte nīsitta miṁte yim̐kanu