సేసినపాటే చాలు చెల్లాటాలు
(॥పల్లవి॥)
సేసినపాటే చాలు చెల్లాటాలు
వాసులు రేఁగితే మరి వడిఁబడుఁ జుమ్మీ
(॥సేసి॥)
చెలువుఁడు పిలువఁగ సెలవి నీవు నవ్వఁగ
యెలయింపుసరసము లెందాఁకనే
బలిమి సేసు నాతఁడు పట్టుదు వెగ్గులు నీవు
కలి ముదిరి మెడిదకలయ్యీఁ జుమ్మీ
(॥సేసి॥)
నీపతి వేగిరించఁగ నీవు సిగ్గులు చల్లేవు
యేపుమీరి జాణతనా లెందాఁకనే
పైపైనున్నాఁ డాతఁడు పంతాలు చూపేవు నీవు
పూపలు ముదురఁగాను పులుసయ్యీఁ జుమ్మీ
(॥సేసి॥)
శ్రీ వేంకటేశుఁడంట చేయి నీవు పట్టుకోఁగ
యావల నలమేల్మంగ యెందాఁకనే
భావించి కూడె నతఁడు పైకొంటివి నీవు నట్టె
చేవదేరిన పనులు చెప్పరాదుసుమ్మీ
(||pallavi||)
sesinabāḍe sālu sĕllāḍālu
vāsulu rem̐gide mari vaḍim̐baḍum̐ jummī
(||sesi||)
sĕluvum̐ḍu piluvam̐ga sĕlavi nīvu navvam̐ga
yĕlayiṁpusarasamu lĕṁdām̐kane
balimi sesu nādam̐ḍu paṭṭudu vĕggulu nīvu
kali mudiri mĕḍidagalayyīm̐ jummī
(||sesi||)
nībadi vegiriṁcham̐ga nīvu siggulu sallevu
yebumīri jāṇadanā lĕṁdām̐kane
paibainunnām̐ ḍādam̐ḍu paṁtālu sūbevu nīvu
pūbalu muduram̐gānu pulusayyīm̐ jummī
(||sesi||)
śhrī veṁkaḍeśhum̐ḍaṁṭa seyi nīvu paṭṭugom̐ga
yāvala nalamelmaṁga yĕṁdām̐kane
bhāviṁchi kūḍĕ nadam̐ḍu paigŏṁṭivi nīvu naṭṭĕ
sevaderina panulu sĕpparādusummī