చేసిన ట్టెల్లా నీకే చెల్లుఁ గాకా
(॥పల్లవి॥)
చేసిన ట్టెల్లా నీకే చెల్లుఁ గాకా
ఆ సుద్దులు దడవి నిన్నంత సేయ వచ్చునా
(॥చేసి॥)
నెమ్మొగము వాడె నంటా నిండుఁజెమ టేడ దంటా
దిమ్మరిమాఁటల నిన్నుఁ దిట్ట వచ్చునా
అమ్మరో పానుపుమీఁద నాకె నీవు నున్నా రంటా
నిమ్మపంటఁ గొని నేము నిన్ను వేయ వచ్చునా
(॥చేసి॥)
యేతల చూచే వంటా యెంగిలిత మ్మేడ దంటా
చేత వంటి నిన్నే మైనాఁ జేయ వచ్చునా
భీతి లేక ఆపె వెంటఁ బెట్టుక వచ్చితి వంటా
నీతి దప్పి చిన్నఁ బో నిన్నుఁ జేయ వచ్చునా
(॥చేసి॥)
ఆకెచే మొక్కించే వంటా అట్టె సిగ్గు వడ వంటా
కాకు సేసి నిన్ను గంపఁ గమ్మ వచ్చునా
యీకడ శ్రీవెంకటేశ యిట్టె నన్నుఁ గూడితిని
పైకొని యింకా నిన్నుఁ బచ్చి సేయ వచ్చునా
(||pallavi||)
sesina ṭṭĕllā nīge sĕllum̐ gāgā
ā suddulu daḍavi ninnaṁta seya vachchunā
(||sesi||)
nĕmmŏgamu vāḍĕ naṁṭā niṁḍum̐jĕma ṭeḍa daṁṭā
dimmarimām̐ṭala ninnum̐ diṭṭa vachchunā
ammaro pānubumīm̐da nāgĕ nīvu nunnā raṁṭā
nimmabaṁṭam̐ gŏni nemu ninnu veya vachchunā
(||sesi||)
yedala sūse vaṁṭā yĕṁgilida mmeḍa daṁṭā
seda vaṁṭi ninne mainām̐ jeya vachchunā
bhīdi lega ābĕ vĕṁṭam̐ bĕṭṭuga vachchidi vaṁṭā
nīdi dappi sinnam̐ bo ninnum̐ jeya vachchunā
(||sesi||)
āgĕse mŏkkiṁche vaṁṭā aṭṭĕ siggu vaḍa vaṁṭā
kāgu sesi ninnu gaṁpam̐ gamma vachchunā
yīgaḍa śhrīvĕṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidini
paigŏni yiṁkā ninnum̐ bachchi seya vachchunā