Sesina semtalu selle nimka

సేసిన చేఁతలు చెల్లె నిఁక
Language

(॥పల్లవి॥)
సేసిన చేఁతలు చెల్లె నిఁక
యీసుల నంతేసి యెఱుఁగుదుమా

(॥సేసి॥)
గేలిసేయ నినుఁ గేరడమాడను
నాలో నూరక నగితినిదే
ఆలరి నీవేల ఆనలు వెట్టేవు
తాలిమితో మిముఁ దడవితిమా

(॥సేసి॥)
తలఁ పెద నడుగ తగవులఁ బెట్టను
చెలితో సుద్దులు చెప్పితిని
కలదిదె నీతారుకాణ లేల యిఁక
వలవనిసణఁగులు వంచితమా

(॥సేసి॥)
కరములు చాఁచను కాఁకలు చల్లను
మురిపెముతోనే మొక్కితిని
యిరవుగ శ్రీవేంకటేశ కూడితివి
గరిమల నిందుకుఁ గాదంటిమా

(||pallavi||)
sesina sem̐talu sĕllĕ nim̐ka
yīsula naṁtesi yĕṟum̐gudumā

(||sesi||)
geliseya ninum̐ geraḍamāḍanu
nālo nūraga nagidinide
ālari nīvela ānalu vĕṭṭevu
tālimido mimum̐ daḍavidimā

(||sesi||)
talam̐ pĕda naḍuga tagavulam̐ bĕṭṭanu
sĕlido suddulu sĕppidini
kaladidĕ nīdārugāṇa lela yim̐ka
valavanisaṇam̐gulu vaṁchidamā

(||sesi||)
karamulu sām̐sanu kām̐kalu sallanu
muribĕmudone mŏkkidini
yiravuga śhrīveṁkaḍeśha kūḍidivi
garimala niṁdugum̐ gādaṁṭimā