(॥పల్లవి॥)
చేసిన చేఁతలే చెల్లుబడి
వాసికి వలపులు వంచఁగదే
(॥చేసి॥)
నగినయందులో నయములు దోఁచెను
అగడుగ పతి నిఁక నాడకువే
జగడపుటొట్లు సతములు గావవి
మొగము చూచి యిఁక మొక్కఁగదే
(॥చేసి॥)
నిలిచినందులో నెయ్యము దొలఁకెను
చలము లతనిపైఁ జల్లకువే
తొలుతటిసిగ్గులు దొంతుల నున్నవి
పిలిచి వినయములఁ బెనఁగకువే
(॥చేసి॥)
చెనకినందులో సేవలు దోఁచెను
కొనగొన నచటనె కొసరకువే
యెనసెను శ్రీవేంకటేశ్వరుఁ డిటు నిను
మనసుమర్మములు మఱవకువే
(||pallavi||)
sesina sem̐tale sĕllubaḍi
vāsigi valabulu vaṁcham̐gade
(||sesi||)
naginayaṁdulo nayamulu dom̐sĕnu
agaḍuga padi nim̐ka nāḍaguve
jagaḍabuḍŏṭlu sadamulu gāvavi
mŏgamu sūsi yim̐ka mŏkkam̐gade
(||sesi||)
nilisinaṁdulo nĕyyamu dŏlam̐kĕnu
salamu ladanibaim̐ jallaguve
tŏludaḍisiggulu dŏṁtula nunnavi
pilisi vinayamulam̐ bĕnam̐gaguve
(||sesi||)
sĕnaginaṁdulo sevalu dom̐sĕnu
kŏnagŏna nasaḍanĕ kŏsaraguve
yĕnasĕnu śhrīveṁkaḍeśhvarum̐ ḍiḍu ninu
manasumarmamulu maṟavaguve