సేసిన పాపము నేఁడు చెప్పకపోదు
(॥పల్లవి॥)
సేసిన పాపము నేఁడు చెప్పకపోదు
నీ సుద్దులు నా గుణము నీకే తెలుసును
(॥సేసి॥)
మచ్చికనీచెలులతో మాటలే యాడుదుఁగాని
మచ్చరము మతినైతే మానదు
ఇచ్చకమాడుదు నీతో యెడనెడ వెంగేలు
విచ్చనవిడి నాడక విడువను
(॥సేసి॥)
వాడిక నీ చెలులతో వంతుకు నంపుదుగాని
యేడలేనికోపమెల్లా ఇందుకొందును
వీడెము నీవిచ్చితేను వేడుకఁ గైకొందుఁగాని
యేడదోయనుచు లోలో నెంచుకొందును
(॥సేసి॥)
నీ కాంతలు మొక్కితేను నేనూ మొక్కుదుఁగాని
రాకలఁబోకల రారాఁపుసేతును
యీకడ శ్రీ వేంకటేశ యిట్టె నన్నుఁగూడితివి
కైకొంటిఁగాని నీరతి కమ్మటిఁ బోలుదును
(||pallavi||)
sesina pābamu nem̐ḍu sĕppagabodu
nī suddulu nā guṇamu nīge tĕlusunu
(||sesi||)
machchiganīsĕlulado māḍale yāḍudum̐gāni
machcharamu madinaide mānadu
ichchagamāḍudu nīdo yĕḍanĕḍa vĕṁgelu
vichchanaviḍi nāḍaga viḍuvanu
(||sesi||)
vāḍiga nī sĕlulado vaṁtugu naṁpudugāni
yeḍalenigobamĕllā iṁdugŏṁdunu
vīḍĕmu nīvichchidenu veḍugam̐ gaigŏṁdum̐gāni
yeḍadoyanusu lolo nĕṁchugŏṁdunu
(||sesi||)
nī kāṁtalu mŏkkidenu nenū mŏkkudum̐gāni
rāgalam̐bogala rārām̐pusedunu
yīgaḍa śhrī veṁkaḍeśha yiṭṭĕ nannum̐gūḍidivi
kaigŏṁṭim̐gāni nīradi kammaḍim̐ boludunu