Sesina nerami needom jeppaga podu

చేసిన నేరమి నీతోఁ జెప్పక పోదు
Language

(॥పల్లవి॥)
చేసిన నేరమి నీతోఁ జెప్పక పోదు
దోసము లే దనవయ్య తొత్త నీకు నేను

(॥॥)
సడిఁ బెట్టినట్టి నా సవతి మచ్చరమున
తొడిఁబడ నూరకే దూరితి నిన్ను
జడిగొన్న ఆపె తోడి జగడపు వేళ నిన్ను
వడి నాకాలు దాఁకినా వంగి మొక్క నైతిని

(॥॥)
గాఁటపుఁ బొరుగువారి కాంతాళపుఁ బరాకున
మాటాడినా నీ తోడ మాటాడ నైతి
నాఁటఁగ నాపెఁ దిట్టుతా నా తమ్మ నీపైఁ బడితే
పాటించి తుడువ నైతిఁ బంత మియ్య నైతిని

(॥॥)
దిమ్మురేఁ చే వారితోడఁ దిట్లాడే పరాకున
యెమ్మెతో నీవు వచ్చిన దెఱఁగ నైతి
కమ్ముక శ్రీ వేంకటేశ గక్కున నన్నుఁ గూడితి
నెమ్మది నా సంతసాన నిన్ను మెచ్చ నైతిని.

(||pallavi||)
sesina nerami nīdom̐ jĕppaga podu
dosamu le danavayya tŏtta nīgu nenu

(||||)
saḍim̐ bĕṭṭinaṭṭi nā savadi machcharamuna
tŏḍim̐baḍa nūrage dūridi ninnu
jaḍigŏnna ābĕ toḍi jagaḍabu veḽa ninnu
vaḍi nāgālu dām̐kinā vaṁgi mŏkka naidini

(||||)
gām̐ṭabum̐ bŏruguvāri kāṁtāḽabum̐ barāguna
māḍāḍinā nī toḍa māḍāḍa naidi
nām̐ṭam̐ga nābĕm̐ diṭṭudā nā tamma nībaim̐ baḍide
pāḍiṁchi tuḍuva naidim̐ baṁta miyya naidini

(||||)
dimmurem̐ se vāridoḍam̐ diṭlāḍe parāguna
yĕmmĕdo nīvu vachchina dĕṟam̐ga naidi
kammuga śhrī veṁkaḍeśha gakkuna nannum̐ gūḍidi
nĕmmadi nā saṁtasāna ninnu mĕchcha naidini.