సేసిన నా చేఁతలెల్లాఁ జెల్లుఁగాక
(॥పల్లవి॥)
సేసిన నా చేఁతలెల్లాఁ జెల్లుఁగాక
వాసులకు నా యీడు వత్తురా కామినులు
(॥సేసి॥)
కందువ నారమణుఁడు గలఁడు నన్ను మన్నించు
యెందరు సవతు లున్నా నేమాయనే
చెంది నా శిరసుమీఁద సేసపాలితఁడు వెట్టె
మందలించి నాతో మారుమలయఁగఁగలరా
(॥సేసి॥)
ఘనుఁడు వేడుకతోడుతఁ గట్టె నాకుఁగంకణము
యెనలేని విరసము లేమిసేసీనే
వొనరఁగఁ దనముద్దుటుంగరము నాకు నిచ్చె
పనులెల్లా నీడేరె పరులు నాకెదురా
(॥సేసి॥)
శ్రీ వేంకటేశుఁడు నన్నుఁ జిత్తగించి యేలినాఁడు
యీవలావలి సుద్దులు యెంత చెప్పేరే
కైవశమై నాతోనే కాఁపురము సేయఁజొచ్చె
దేవులనైతి నిఁకఁ దెలుపఁగవలెనా
(||pallavi||)
sesina nā sem̐talĕllām̐ jĕllum̐gāga
vāsulagu nā yīḍu vatturā kāminulu
(||sesi||)
kaṁduva nāramaṇum̐ḍu galam̐ḍu nannu manniṁchu
yĕṁdaru savadu lunnā nemāyane
sĕṁdi nā śhirasumīm̐da sesabālidam̐ḍu vĕṭṭĕ
maṁdaliṁchi nādo mārumalayam̐gam̐galarā
(||sesi||)
ghanum̐ḍu veḍugadoḍudam̐ gaṭṭĕ nāgum̐gaṁkaṇamu
yĕnaleni virasamu lemisesīne
vŏnaram̐gam̐ danamudduḍuṁgaramu nāgu nichchĕ
panulĕllā nīḍerĕ parulu nāgĕdurā
(||sesi||)
śhrī veṁkaḍeśhum̐ḍu nannum̐ jittagiṁchi yelinām̐ḍu
yīvalāvali suddulu yĕṁta sĕppere
kaivaśhamai nādone kām̐puramu seyam̐jŏchchĕ
devulanaidi nim̐kam̐ dĕlubam̐gavalĕnā