Sesi seyimchugonela sellambo vo ramanumda

సేసి సేయించుకోనేల చెల్లఁబో వో రమణుఁడ
Language

(॥పల్లవి॥)
సేసి సేయించుకోనేల చెల్లఁబో వో రమణుఁడ
ఆసవెల్లాఁ జూపితేను అట్టె తొక్కెఁ బాదము

(॥సేసి॥)
పంతము నెరపఁబోతే పడతి గోరు దాకించె
మంతన మాడఁగానే మర్మము లంటె
వంతులకుఁ బెనఁగితే వట్రువ చన్నుల నొత్తె
చెంతఁజెరఁగు వట్టితే చెక్కుచేత నంటెను

(॥సేసి॥)
బొమ్మల జంకించితేను పుక్కిటి తమ్ముల మిడె
రమ్మని పిలచితే నురము దట్టేను
వుమ్మడిఁ బొత్తుకుఁ బోతే వొట్లెల్లాఁ బెట్టె నీకు
ముమ్మాటికిఁ దిట్టితేను మోవిగంటి సేసెను

(॥సేసి॥)
గక్కనఁ గాఁగిలించితే గబ్బితనమెల్లాఁ జూపె
చొక్కించితే చెప్పరాని సుద్దులు చెప్పె
ఇక్కువెరిఁగి శ్రీ వేంకటేశ నీవు మన్నించితే
వెక్కసపు రతులను వెల్లిగాఁ గొలిపెను

(||pallavi||)
sesi seyiṁchugonela sĕllam̐bo vo ramaṇum̐ḍa
āsavĕllām̐ jūbidenu aṭṭĕ tŏkkĕm̐ bādamu

(||sesi||)
paṁtamu nĕrabam̐bode paḍadi goru dāgiṁchĕ
maṁtana māḍam̐gāne marmamu laṁṭĕ
vaṁtulagum̐ bĕnam̐gide vaṭruva sannula nŏttĕ
sĕṁtam̐jĕram̐gu vaṭṭide sĕkkuseda naṁṭĕnu

(||sesi||)
bŏmmala jaṁkiṁchidenu pukkiḍi tammula miḍĕ
rammani pilaside nuramu daṭṭenu
vummaḍim̐ bŏttugum̐ bode vŏṭlĕllām̐ bĕṭṭĕ nīgu
mummāḍigim̐ diṭṭidenu movigaṁṭi sesĕnu

(||sesi||)
gakkanam̐ gām̐giliṁchide gabbidanamĕllām̐ jūbĕ
sŏkkiṁchide sĕpparāni suddulu sĕppĕ
ikkuvĕrim̐gi śhrī veṁkaḍeśha nīvu manniṁchide
vĕkkasabu radulanu vĕlligām̐ gŏlibĕnu