Sesenaa vinayamulu segomta gaaga

చేసేనా వినయములు చేకొంట గాక
Language

(॥పల్లవి॥)
చేసేనా వినయములు చేకొంట గాక
ఆసలే కాఁక రేఁచితే అందుకేమి సేతమే

(॥॥)
చెక్కు నొక్కఁబోఁగాను చేతిగోరు దాఁకె నింతే
వెక్కసాన విదిలించి వేసేవేమే
పక్కన విందువెట్టి పలురుచులు సేయఁగా
నక్కడాఁ గరఁగదు అందుకేమి సేతమే

(॥॥)
సరసమాడఁబోఁగా చన్నులు బయటఁబడె
యిరవై యిందుకేల యీసడించేవే
గరిమ సొమ్ములు నీకుఁ గడుఁగడుఁ బెట్టఁగాను
అరగొరవైతయైతే నందుకేమి సేతమే

(॥॥)
పొంది కొంగువట్టఁ బోఁగా పోఁకముడి వీడె నింతే
చిందువందై ఇందుకేల సిగ్గువడేవే
కందువ శ్రీ వేంకటాద్రి ఘనుఁడ నేఁ గలసితి
అందుపుటాయాలు సోఁకె నందకేమి సేతమే

(||pallavi||)
sesenā vinayamulu segŏṁṭa gāga
āsale kām̐ka rem̐side aṁdugemi sedame

(||||)
sĕkku nŏkkam̐bom̐gānu sedigoru dām̐kĕ niṁte
vĕkkasāna vidiliṁchi veseveme
pakkana viṁduvĕṭṭi palurusulu seyam̐gā
nakkaḍām̐ garam̐gadu aṁdugemi sedame

(||||)
sarasamāḍam̐bom̐gā sannulu bayaḍam̐baḍĕ
yiravai yiṁdugela yīsaḍiṁcheve
garima sŏmmulu nīgum̐ gaḍum̐gaḍum̐ bĕṭṭam̐gānu
aragŏravaidayaide naṁdugemi sedame

(||||)
pŏṁdi kŏṁguvaṭṭam̐ bom̐gā pom̐kamuḍi vīḍĕ niṁte
siṁduvaṁdai iṁdugela sigguvaḍeve
kaṁduva śhrī veṁkaḍādri ghanum̐ḍa nem̐ galasidi
aṁdubuḍāyālu som̐kĕ naṁdagemi sedame