Sesemgaa daivamu neesedimeemdugaa nemdu

సేసెఁగా దైవము నీచేతిమీఁదుగా నేఁడు
Language

(॥పల్లవి॥)
సేసెఁగా దైవము నీచేతిమీఁదుగా నేఁడు
వేసితిఁగా పైఁజేయి వింతలేమీ నెంచక

(॥సేసెఁ॥)
వొంటి నేను రాతిరెల్లా వొక్కతెనే వుండినాను
కంటిఁగా వేగైనా నిన్నుఁగన్నులెదుట
దంటవై నీ వెంత మతిఁ దలఁచ కుండినా నేనే
వుంటిగా నీ వద్ద వచ్చి వున్నవేమీ నెంచక

(॥సేసెఁ॥)
పాడిపంతాలను నీవు పరాకుతో నుండినాను
ఆడితిఁగా నీతో మాట లప్పుడే నేను
యీడుగాని సతులతో నెగసక్కేలు సేసినా
కూడితిఁగా నీమతానఁ గోపగించు కొనక

(॥సేసెఁ॥)
పాఁగినచెమట నెంతపచ్చయి నీవు వచ్చినా
కాఁగిలించితిఁగా నిన్ను గక్కున నేను
వీఁగనిరతుల శ్రీవేంకటేశ కూడితివి
దాఁగనేల ఇదె నీకె దక్కెఁగా చలము

(||pallavi||)
sesĕm̐gā daivamu nīsedimīm̐dugā nem̐ḍu
vesidim̐gā paim̐jeyi viṁtalemī nĕṁchaga

(||sesĕm̐||)
vŏṁṭi nenu rādirĕllā vŏkkadĕne vuṁḍinānu
kaṁṭim̐gā vegainā ninnum̐gannulĕduḍa
daṁṭavai nī vĕṁta madim̐ dalam̐sa kuṁḍinā nene
vuṁṭigā nī vadda vachchi vunnavemī nĕṁchaga

(||sesĕm̐||)
pāḍibaṁtālanu nīvu parāgudo nuṁḍinānu
āḍidim̐gā nīdo māḍa lappuḍe nenu
yīḍugāni sadulado nĕgasakkelu sesinā
kūḍidim̐gā nīmadānam̐ gobagiṁchu kŏnaga

(||sesĕm̐||)
pām̐ginasĕmaḍa nĕṁtabachchayi nīvu vachchinā
kām̐giliṁchidim̐gā ninnu gakkuna nenu
vīm̐ganiradula śhrīveṁkaḍeśha kūḍidivi
dām̐ganela idĕ nīgĕ dakkĕm̐gā salamu