సేసేటి వూడిగములు సేఁతలు వేరై వున్నవి
(॥పల్లవి॥)
సేసేటి వూడిగములు సేఁతలు వేరై వున్నవి
ఆసల నాసల నివ్వెర గందితి విది యేమే
(॥సేసే॥)
చిత్తములోపల తమకము సిగ్గులు సెలవులఁగారఁగ
హత్తుక బాగా లొసఁగే వాతనికే నీవు
యిత్తల నదియునుఁగాకే యెగదిగ నాతనిఁజూచుచు
చిత్తిణిగుణముల చెక్కులు చెమరించే వేమే
(॥సేసే॥)
ముక్కున నిట్టూరుపులును ముద్దులు పెదవులఁదొలకఁగ
వెక్కసమగువింజామర వేసే విటు నీవు
గక్కున నంతటిలోనే కందువ లటు దాఁకింపుచు
పుక్కట సంతోంబులఁ బులకించే వేమే
(॥సేసే॥)
చన్నులకొన లటు సోఁకఁగ సందులు గొందులు దాఁకఁగ
వున్నతి నీతనిపాదము లొత్తే విటు నీవు
ఇన్నిట శ్రీవేంకటపతి యీతఁడె నను నిటు గూడెను
మున్నిటిచేఁతల కిప్పుడు మొక్కే విది యేమే
(||pallavi||)
seseḍi vūḍigamulu sem̐talu verai vunnavi
āsala nāsala nivvĕra gaṁdidi vidi yeme
(||sese||)
sittamulobala tamagamu siggulu sĕlavulam̐gāram̐ga
hattuga bāgā lŏsam̐ge vādanige nīvu
yittala nadiyunum̐gāge yĕgadiga nādanim̐jūsusu
sittiṇiguṇamula sĕkkulu sĕmariṁche veme
(||sese||)
mukkuna niṭṭūrubulunu muddulu pĕdavulam̐dŏlagam̐ga
vĕkkasamaguviṁjāmara vese viḍu nīvu
gakkuna naṁtaḍilone kaṁduva laḍu dām̐kiṁpusu
pukkaḍa saṁtoṁbulam̐ bulagiṁche veme
(||sese||)
sannulagŏna laḍu som̐kam̐ga saṁdulu gŏṁdulu dām̐kam̐ga
vunnadi nīdanibādamu lŏtte viḍu nīvu
inniḍa śhrīveṁkaḍabadi yīdam̐ḍĕ nanu niḍu gūḍĕnu
munniḍisem̐tala kippuḍu mŏkke vidi yeme