Sesedi maa semtalella simgaaraale

సేసేటి మా సేఁతలెల్ల సింగారాలే
Language

(॥పల్లవి॥)
సేసేటి మా సేఁతలెల్ల సింగారాలే
మూసిన ముత్తేలము మొనలంత చూపము

(॥సేసే॥)
చూపులకు వాండ్లు సూటియై వుండును తొల్లె
కోపగించుకొన్నఁ బూవు కొత్తగా నీపై
నీ పనులకు మతిలో నీకు నీకే తోఁచీఁగాని
తీపులమోవివారము తెగవలు సేయము

(॥సేసే॥)
వొత్తుఁ జన్నులు గట్టులై వుండేది సాజమే
మెత్తఁ జేసితేఁగావు మించి నీచేత
హత్తిన నీగుండెవంక నవి రాఇకొనెఁగాని
నిత్తెపుఁగోమలులము నిష్ఠూరము చూపము

(॥సేసే॥)
చేతులకుఁ గొనగోళ్లు చిగిరించేది సాజమే
కాంతరించితేఁ బోము కలకాలము
యేతుల శ్రీ వేంకటేశ యెంచనేల కూడితిమి
ఆతుమైన వారము అంత రట్టు సేసేమా

(||pallavi||)
seseḍi mā sem̐talĕlla siṁgārāle
mūsina muttelamu mŏnalaṁta sūbamu

(||sese||)
sūbulagu vāṁḍlu sūḍiyai vuṁḍunu tŏllĕ
kobagiṁchugŏnnam̐ būvu kŏttagā nībai
nī panulagu madilo nīgu nīge tom̐sīm̐gāni
tībulamovivāramu tĕgavalu seyamu

(||sese||)
vŏttum̐ jannulu gaṭṭulai vuṁḍedi sājame
mĕttam̐ jesidem̐gāvu miṁchi nīseda
hattina nīguṁḍĕvaṁka navi rāigŏnĕm̐gāni
nittĕbum̐gomalulamu niṣhṭhūramu sūbamu

(||sese||)
sedulagum̐ gŏnagoḽlu sigiriṁchedi sājame
kāṁtariṁchidem̐ bomu kalagālamu
yedula śhrī veṁkaḍeśha yĕṁchanela kūḍidimi
ādumaina vāramu aṁta raṭṭu sesemā