చేచేత నీకుపాయాలు చెప్పవలెనా నేము
(॥పల్లవి॥)
చేచేత నీకుపాయాలు చెప్పవలెనా నేము
యేచి నీకు నింతేసి యెచ్చరించవలెనా
(॥చేచే॥)
పంతము నీతో నాడి పవ్వళించినది చెలి
చెంత వేఁడుకోరాదా చెక్కునొక్కి
వింత లేక నీవే ముందు వీడెము చేతికీరాదా
మంతనాన మాటదీసి మచ్చిక చూపరాదా
(॥చేచే॥)
మొక్కలము నీకుజూపి ముసుఁగు వెట్టుకున్నది
గక్కున మోవియ్యరాదా కాఁగిలించి
పక్కన నప్పటి నీవు పచ్చడము గప్పరాదా
చిక్కని నవ్వులు నవ్వి చెంగలించరాదా
(॥చేచే ॥)
తప్పకిట్టే నిన్నుఁ జూచి తలవంచుకున్నది
గొప్పచన్నులంటి యిట్టే కూడఁగరాదా
యిప్పుడే శ్రీవేంకటేశ యీకాంత నేలితివి
దప్పిదేర రతుల వింతలు సేయరాదా
(||pallavi||)
seseda nīgubāyālu sĕppavalĕnā nemu
yesi nīgu niṁtesi yĕchchariṁchavalĕnā
(||sese||)
paṁtamu nīdo nāḍi pavvaḽiṁchinadi sĕli
sĕṁta vem̐ḍugorādā sĕkkunŏkki
viṁta lega nīve muṁdu vīḍĕmu sedigīrādā
maṁtanāna māḍadīsi machchiga sūbarādā
(||sese||)
mŏkkalamu nīgujūbi musum̐gu vĕṭṭugunnadi
gakkuna moviyyarādā kām̐giliṁchi
pakkana nappaḍi nīvu pachchaḍamu gapparādā
sikkani navvulu navvi sĕṁgaliṁcharādā
(||sese ||)
tappagiṭṭe ninnum̐ jūsi talavaṁchugunnadi
gŏppasannulaṁṭi yiṭṭe kūḍam̐garādā
yippuḍe śhrīveṁkaḍeśha yīgāṁta nelidivi
dappidera radula viṁtalu seyarādā