సేసే దేమిక మన మిటు చెలియకు నుపచారంబులు
(॥పల్లవి॥)
సేసే దేమిక మన మిటు చెలియకు నుపచారంబులు
సేసల రమణుని చిత్తమే శేఖర మిఁక నేమే
(॥సేసే॥)
కప్పుర మిచ్చిన నంటదు కామిని దన మదనాగ్నుల
నిప్పులమీఁదటఁ గప్పిన నిగురదే యంటాను
పుప్పొడిచల్లిన నులికి పువ్విలుతుని వెడదాడికి
వుప్పర మెగసి దుమ్మనీ వొ చెలి యిది యేమే
(॥సేసే॥)
కాంతకు కస్తూరి యిచ్చిన కలఁగి తనమది ముంచిన
చింతల చీఁకటి లోపలి సిలు గిది యంటాను
వింతగు వెలివము గప్పిన వేసవి వెన్నెల నురుగులు
పొంతట పైఁ గప్పె ననచు పొగిలీ నిది యేమే
(॥సేసే॥)
చందన మిచ్చిన నొల్లదు సతి యిటు వలపులనూఁదిన
మందులు ముద్దగఁ జేసిన మాయ లి వంటాను
యిందునే శ్రీవేంకటపతి యీసతి నింతటఁ గూడఁగ
ముందును వెనకయుఁ దెలిసెను మోహం బిది యేమే
(||pallavi||)
sese demiga mana miḍu sĕliyagu nubasāraṁbulu
sesala ramaṇuni sittame śhekhara mim̐ka neme
(||sese||)
kappura michchina naṁṭadu kāmini dana madanāgnula
nippulamīm̐daḍam̐ gappina nigurade yaṁṭānu
puppŏḍisallina nuligi puvviluduni vĕḍadāḍigi
vuppara mĕgasi dummanī vŏ sĕli yidi yeme
(||sese||)
kāṁtagu kastūri yichchina kalam̐gi tanamadi muṁchina
siṁtala sīm̐kaḍi lobali silu gidi yaṁṭānu
viṁtagu vĕlivamu gappina vesavi vĕnnĕla nurugulu
pŏṁtaḍa paim̐ gappĕ nanasu pŏgilī nidi yeme
(||sese||)
saṁdana michchina nŏlladu sadi yiḍu valabulanūm̐dina
maṁdulu muddagam̐ jesina māya li vaṁṭānu
yiṁdune śhrīveṁkaḍabadi yīsadi niṁtaḍam̐ gūḍam̐ga
muṁdunu vĕnagayum̐ dĕlisĕnu mohaṁ bidi yeme