Sese deme yimka vaani sittamu naabhaagyamu

సేసే దేమే యిఁక వాని చిత్తము నాభాగ్యము
Language

(॥పల్లవి॥)
సేసే దేమే యిఁక వాని చిత్తము నాభాగ్యము
బాస యిచ్చినాఁడు నాకు బత్తిగలఁ డతఁడు

(॥సేసే॥)
వలెనని వినేనంటే వాని సుద్దు లెన్ని లేవు
పలుకులఁ జెప్పేనంటే బండ్లు నిండు
తలఁచితే మనసులో దగులు జిగురువలె
కొలఁది వెట్టఁగరాక గుట్టుతో నుందాననే

(॥సేసే॥)
నిక్కి చూచేనంటే వాని నిలువు నూరు పండు
చక్కఁదనా లెంచేనంటే సారె నొరూరు
తక్కక పొందుసేసితే తరితీపులు గనము
ముక్కుపై వే లిడుకొని మోనాన నుందాననే

(॥సేసే॥)
చెనకే నంటే వాని చేఁతలు మీఁద మిక్కిలి
పెనఁగితే రతులను పెచ్చువెరుగు
యెనసె శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్ను నేఁడు
వొనరి నివ్వెరగుతో నూరకే వుందాననే

(||pallavi||)
sese deme yim̐ka vāni sittamu nābhāgyamu
bāsa yichchinām̐ḍu nāgu battigalam̐ ḍadam̐ḍu

(||sese||)
valĕnani vinenaṁṭe vāni suddu lĕnni levu
palugulam̐ jĕppenaṁṭe baṁḍlu niṁḍu
talam̐side manasulo dagulu jiguruvalĕ
kŏlam̐di vĕṭṭam̐garāga guṭṭudo nuṁdānane

(||sese||)
nikki sūsenaṁṭe vāni niluvu nūru paṁḍu
sakkam̐danā lĕṁchenaṁṭe sārĕ nŏrūru
takkaga pŏṁduseside taridībulu ganamu
mukkubai ve liḍugŏni monāna nuṁdānane

(||sese||)
sĕnage naṁṭe vāni sem̐talu mīm̐da mikkili
pĕnam̐gide radulanu pĕchchuvĕrugu
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannu nem̐ḍu
vŏnari nivvĕragudo nūrage vuṁdānane