సేసవెట్టి పెండ్లాడె చెనకి తొల్లే నన్ను
(॥పల్లవి॥)
సేసవెట్టి పెండ్లాడె చెనకి తొల్లే నన్ను
దోసము గాకుండా బతిఁ దోడుక రారే
(॥॥)
పట్టరానిది వయసు పాయరానిది నేస్తము
గుట్టుతోఁ దిప్పరానిది గుణము
మట్టుపెట్టరానిది మనసులో దలపోఁ త
యిట్టె విభుఁడు రాఁడు యెట్టుసేతునే
(॥॥)
ఆఁపరానిది వలపు అణచరానిది చూపు
దాఁపరానిది లోలో తమకము
రూపించరానిది రుచులైనతరితీపు
యిపోద్దే రమణుని కెఱిఁగించిరే
(॥॥)
తుంచరానిది యాస తొలఁగరానిది వాని
కొంచించరానిది కూడినరతి
అంచెల శ్రీవేంకటేశుఁ డంతలోనె నన్నుఁ గూడె
ముంచీ నాకు సిగ్గులు మొక్కితిననరే
(||pallavi||)
sesavĕṭṭi pĕṁḍlāḍĕ sĕnagi tŏlle nannu
dosamu gāguṁḍā badim̐ doḍuga rāre
(||||)
paṭṭarānidi vayasu pāyarānidi nestamu
guṭṭudom̐ dipparānidi guṇamu
maṭṭubĕṭṭarānidi manasulo dalabom̐ ta
yiṭṭĕ vibhum̐ḍu rām̐ḍu yĕṭṭusedune
(||||)
ām̐parānidi valabu aṇasarānidi sūbu
dām̐parānidi lolo tamagamu
rūbiṁcharānidi rusulainadaridību
yibodde ramaṇuni kĕṟim̐giṁchire
(||||)
tuṁcharānidi yāsa tŏlam̐garānidi vāni
kŏṁchiṁcharānidi kūḍinaradi
aṁchĕla śhrīveṁkaḍeśhum̐ ḍaṁtalonĕ nannum̐ gūḍĕ
muṁchī nāgu siggulu mŏkkidinanare