సేసవెట్టి మోము చూపి చెలిసిగ్గు దేర్చితివి
(॥పల్లవి॥)
సేసవెట్టి మోము చూపి చెలిసిగ్గు దేర్చితివి
లేసుల నీగుణాలెన్ని లెక్కవెట్టేమయ్యా
(॥సే॥)
నెలఁతను లాలించ నీవే నేరుతువు
తలకొని పొందు సేయఁ దగుదువు
కలసిమెలఁగేయందు కడుజాణ వౌదువు
పొలసి నిన్నెంతని పొగడేమయ్యా
(॥సే॥)
మాటనే చొక్కించి మరిగించుకోగలవు
మేటితనముల మంచిమెరవణివి
చాటువగా వలచితే చనవులియ్యఁగలవు
తేటగా నీమహిమెట్టు దెలిసేమయ్యా
(॥సే॥)
నవ్వులనే నమ్మించి ననుచఁ జేసుకొందువు
నివ్వటిల్లఁ గూడి మేలునెరపుదువు
యివ్వల నలమేల్‌మంగనేలిన శ్రీవేంకటేశ
చివ్వన నీవిద్య లెట్టు చెప్పఁగలమయ్యా
(||pallavi||)
sesavĕṭṭi momu sūbi sĕlisiggu dersidivi
lesula nīguṇālĕnni lĕkkavĕṭṭemayyā
(||se||)
nĕlam̐tanu lāliṁcha nīve neruduvu
talagŏni pŏṁdu seyam̐ daguduvu
kalasimĕlam̐geyaṁdu kaḍujāṇa vauduvu
pŏlasi ninnĕṁtani pŏgaḍemayyā
(||se||)
māḍane sŏkkiṁchi marigiṁchugogalavu
meḍidanamula maṁchimĕravaṇivi
sāḍuvagā valaside sanavuliyyam̐galavu
teḍagā nīmahimĕṭṭu dĕlisemayyā
(||se||)
navvulane nammiṁchi nanusam̐ jesugŏṁduvu
nivvaḍillam̐ gūḍi melunĕrabuduvu
yivvala nalamelmaṁganelina śhrīveṁkaḍeśha
sivvana nīvidya lĕṭṭu sĕppam̐galamayyā